Heart Attack Symptoms: భారతదేశంలో గుండెపోటు మరణాలకు ప్రధాన కారణం మారుతున్న జీవన శైలి. ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా నాలుగురిలో ఒకరు గుండె సంబంధిత సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా యువతే ఈ గుండె సంబంధిత సమస్యలకు లోనవుతున్నారు. కావున తక్కువ వయసులో పలు రకాల శరీర సమస్యలు వస్తే అస్సలే విస్మరించవద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
గుండెపోటు లక్షణాలు:
గుండె జబ్బులు చాలా తీవ్రమైన శరీర సమస్య. కాబట్టి బాడీలో కొన్ని ప్రత్యేక మార్పులు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఛాతీ నొప్పి:
గుండెపోటు రాకముందే ఛాతీలో నొప్పి, అసౌకర్యలు వంటి సమస్యలు వస్తాయి. ఇది గుండెపోటు యొక్క ముఖ్య లక్షణమని నిపుణులు తెలుపుతున్నారు. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటే.. వెంటనే చెకప్ చేయించుకోవాలి.
2. విపరీతమైన చెమట:
నిండు ఏసీ గదిలో కూడా కొంతమందికి చెమటలు పట్టడం తరచుగా చూస్తూ ఉంటారు. నిజానికి, ఇది పెద్ద ప్రమాదానికి సంకేతం. సాధారణంగా ఇటువంటి సమస్య గుండెపోటుకు ముందు వస్తుంది.
3. అలసట:
శరీరంలో గుండెపోటు ప్రమాదం పెరిగినప్పుడు.. తక్కువ పని చేసిన త్వరగా అలసిపోతారు.
4. టెన్షన్:
మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకుంటే.. శరీరంలోని ఇతర భాగాలలో కూడా సమస్యలు తలెత్తుతాయి. గుండెపోటుకు ముందు ఒత్తిడి వస్తుంది. కావున ఇలాంటి సమస్య ఉంటే.. వైద్యుడిని సంప్రదించడం మంచిది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read:High Cholesterol Treatment: చెడు కొలెస్ట్రాల్ నుంచి విముక్తి పొందడానికి రోజూ ఇలా చేయండి..!
Also read: Cucumber Drink Benefits: దోసకాయల డ్రింక్‌తో ఇలా సులభంగా బరువును తగ్గించుకోండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook