Unhealthy Liver Signs: శరీరం అనారోగ్యంగా ఉనప్పుడు వివిధ రకాల లక్షణాలు బయటపడుతుంటాయి. అదే విధంగా మనిషి శరీరంలోని ముఖ్యమైన అంగాలు ఆరోగ్యంగా ఉన్నాయా లేవా అనేది కూడా కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి మనిషి శరీరంలో అతి ముఖ్యమైన లివర్ ఆరోగ్యంగా ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవడం..
మనిషి శరీరంలో ఏదైనా అంగం పాడైతే కొన్ని లక్షణాలు బయటపడతాయి. అదే విధంగా ఆరోగ్యంగా ఉన్నా సరే కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చు. ఇప్పుడు మనం మనిషి శరీరంలో కిడ్నీ, గుండెతో పాటు మరో ముఖ్యమైన అంగం లివర్ గురించి తెలుసుకుందాం. మీ లివర్ ఆరోగ్యంగా ఉందా లేదా అనేది కొన్ని లక్షణాల్ని బట్టి గుర్తించవచ్చు. ఇది తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తే చాలా సందర్భాల్లో ప్రాణాంతకం కాగలదు. అదే సకాలంలో గుర్తించగలిగితే చికిత్స ద్వారా సరిచేసుకోవచ్చు. మీ లివర్ ఆరోగ్యంగా ఉందా లేదా అనేది ఎలాంటి సంకేతాలతో తెలుసుకోవచ్చో చూద్దాం..
లివర్ హెల్తీగా ఉంటే లక్షణాలు ఇలా..
1. ఎవరైనా వ్యక్తి లివర్ సరిగ్గా పనిచేస్తుందంటే..ఆ వ్యక్తి చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడు. అంటే నీరసం వంటివి కన్పించవు. ఎందుకంటే లివర్ ఆరోగ్యంగా ఉంటే మెటబోలిజం బాగుంటుంది. మెటబోలిజం సరిగ్గా లేకపోతే లివర్ పనితీరు సరిగ్గా లేదని అర్దం చేసుకోవచ్చు. లేదా లివర్ ఆరోగ్యంగా లేదని అర్ధం.
2. లివర్ అనేది మనం తినే ఆహారాన్ని సరైన రీతిలో జీర్ణించడమే కాకుండా మెటబోలిజం ప్రక్రియను మెరుగుపర్చడం లేదా వేగవంతం చేయడంలో దోహదపడుతుంది. ఒకవేళ మీ లివర్ ఆరోగ్యంగా ఉందంటే మీ బరువు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంటే హెల్తీ వెయిట్ కలిగి ఉంటారు. లివర్ సమస్య ఎక్కువగా స్థూలకాయం ఉన్నవారిలో కన్పిస్తుంది. ఈ మధ్య కాలంలో తినే ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్, నాన్ వెజ్ కారణంగా ఫ్యాటీ లివర్ సమస్య ప్రధానంగా కన్పిస్తోంది. ఈ సమస్యను డైటింగ్, వ్యాయామం లేదా వాకింగ్ ద్వారా సరిచేసుకోవచ్చు.
3. ఎవరైనా వ్యక్తి లివర్ సరిగ్గా పనిచేస్తుంటే ఆ వ్యక్తి చర్మం, కంటి రంగు సామాన్యంగా ఉంటుంది. అదే లివర్ సరిగ్గా పనిచేయకపోతే ముఖం, కళ్లు, చర్మం పాలిపోయినట్టు కన్పిస్తాయి. ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
4. ఎవరైనా వ్యక్తికి సమయానికి ఆకలి వేయడం జరుగుతుందంటే ఆ వ్యక్తి లివర్ సరిగ్గా పనిచేస్తుందని అర్ధం. ఎందుకంటే ఒకవేళ లివర్ సరిగ్గా పనిచేయకపోతే ఆకలి కూడా సరిగ్గా ఉండదు. ఏమీ తినాలన్పించదు. అందుకే ఈ లక్షణాల్ని బట్టి మీ లివర్ ఎంతవరకు ఆరోగ్యంగా ఉందనేది అంచనా వేసుకుని..కాని పరిస్థితుల్లో వైద్యుడిని సంప్రదించాలి.
Also Read: Wipro Firing: ఉద్యోగులకు మళ్లీ షాకిచ్చిన విప్రో.. మరో లేఆఫ్ ప్రకటన.. ఈసారి ఎంతమంది అంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook