Benefits of Coconut Water: వేసవికాలం అంటేనే ఎప్పుడూ ఏదో ఒకటి తాగాలి అనిపిస్తూ ఉంటుంది. చల్లగా తీయగా ఏదైనా తాగుతూ ఉంటే ముఖ్యంగా వేసవికాలంలో కడుపుకి హాయిగా ఉంటుంది. అలా అని ఎప్పుడూ మంచినీళ్ళే తాగాలి అంటే బోర్ కొడుతుంది. అలాకాకుండా బయట ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఇక కూల్ డ్రింక్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇలాంటి సమయంలోనే వేసవికాలంలో వేడి తాపాన్ని తీర్చగలిగే పానీయం కొబ్బరినీళ్లు.
ఎన్నో పోషకాలు:
కొబ్బరి నీళ్లలో 94% నీళ్లు మాత్రమే ఉంటాయి. కొవ్వు శాతం మిగతా పానియాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఒక గ్లాసు అంటే సుమారుగా 250 ml కొబ్బరి నీళ్లల్లో మూడు గ్రాముల ఫైబర్, రెండు గ్రాముల ప్రోటీన్ ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా శరీరానికి అత్యవసరమైన విటమిన్ సి, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, సోడియం, క్యాల్షియం వంటివి కూడా కొబ్బరి నీళ్లలో పుష్కలంగా దొరుకుతాయి. ఇన్ని పోషకాలు ఉన్న కొబ్బరినీళ్ళ వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
డిటాక్స్ డ్రింక్:
కొబ్బరి నీళ్లల్లో ఎక్కువగా ఉండే పొటాషియం మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను పూర్తిగా తొలగించగలదు. అంతేకాకుండా కొబ్బరి నీళ్లలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు మన కాలేయం ఆరోగ్యంగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి కొబ్బరి నీళ్లను సమర్ డ్రింక్ లా మాత్రమే కాక డీటాక్స్ డ్రింక్ గా కూడా తాగవచ్చు.
జీర్ణక్రియ మెరుగుదల:
కొబ్బరి నీళ్ల వల్ల శరీరంలో ఉండే ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. మన కడుపుని శాంత పరచడం మాత్రమే కాక పేగుల కదలికను కూడా సులువుగా చేస్తుంది. దీనివల్ల మన జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ బాగా జరిగి మలబద్ధకం వంటి సమస్యలు మన దరిదాపుల్లోకి రాకుండా చేస్తుంది.
ఎసిడిటీ నుంచి వెంటనే విముక్తి:
ఎసిడిటీతో బాధపడేవాళ్లు కొబ్బరి నీళ్ళు తాగడం చాలా మంచిది. కొబ్బరి నీళ్లలో ఉండే ఆల్కలీన్ గుణాలు ఎసిడిటీకి వెంటనే చెక్ పెడతాయి. అంతేకాకుండా మన శరీరంలో ఉండే పీహెచ్ లెవెల్స్ ని కూడా బ్యాలెన్స్ చేస్తాయి.
రోగ నిరోధక శక్తి:
కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ తో సమర్థవంతంగా పోరాటం చేస్తాయి. దీనివల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ నుంచి కొబ్బరి నీళ్లు మన శరీరాన్ని సంరక్షిస్తాయి. అంతేకాకుండా కొబ్బరి నీళ్లలో పుష్కలంగా దొరికే ఆంటీ బ్యాక్టీరియల్ గుణాలు, పైరిడాక్సిన్ విటమిన్లు, ఫోలేట్స్ మన ఇమ్యూనిటీని మెరుగుపరుస్తాయి.
గర్భిణీ స్త్రీలకు మంచి ఔషధం:
కొబ్బరి నీళ్లలో ఉండే సహజ తీయదనం వల్ల షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్లు కూడా కొబ్బరి నీళ్లను తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. ఇక గర్భిణీ స్త్రీలకు కొబ్బరినీళ్లు మంచి ఔషధంగా చెప్పుకోవచ్చు. అందులో ఉండే విటమిన్ బి 9 కడుపులో ఉండే బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా వచ్చే జీర్ణ సమస్యలు, ఎసిడిటీ, హైపర్ టెన్షన్ వంటివి కూడా కొబ్బరినీళ్ళ వల్ల తగ్గిపోతాయి.
గుండె ఆరోగ్యం:
కొబ్బరినీళ్లు తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది అని 2008 లో జరిగిన ఒక అధ్యయనం స్పష్టం చేసింది. కొబ్బరినీళ్లు రోజు తాగడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు కూడా నియంత్రించబడ్డాయట. అంతేకాకుండా కొబ్బరినీళ్ళ వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుగా జరుగుతుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు మన జోలికి రావు. కొబ్బరినీళ్ళ వల్ల హైపర్ టెన్షన్ కూడా తగ్గుతుంది అని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Kavya Maran Crying: గుండెల్ని పిండేసే సన్నివేశం.. కన్నీళ్లు పెట్టుకున్న కావ్య పాప
Also Read: Hardik Pandya Divorce: క్రికెటర్ హార్దిక్ పాండ్యా విడాకుల వార్తలు.. భార్య నటాషా స్పందన ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter