Health tips: కాలు మీద కాలు వేసి కూర్చుంటున్నారా ? ఐతే మీకు ఈ సమస్యలు తప్పవట!

Health issues with crossed leg posture: మీరు సాధారణంగా ఇంట్లో కానీ లేదా ఆఫీసులో రిలాక్స్‌డ్ మూడ్‌లో ఉన్నప్పుడు ఎలా కూర్చుంటారనే దానిపై మీరు ఎప్పుడైనా దృష్టిసారించారా ? మనలో చాలా మందిని ఒక కాలుపై మరొక కాలు వేసి అంటే క్రాస్ లెగ్ వేసి కూర్చోవడం చూస్తుంటాము.

Last Updated : Sep 18, 2020, 01:38 PM IST
  • కూర్చునే విధానాలు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని మీకు తెలుసా ?
  • కాలుపై కాలు వేసుకుని ( Crossed leg sitting posture ) కూర్చోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో హానీ అని చెబుతున్న వైద్య నిపుణులు.
  • కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే వచ్చే నష్టమేంటి ?
Health tips: కాలు మీద కాలు వేసి కూర్చుంటున్నారా ? ఐతే మీకు ఈ సమస్యలు తప్పవట!

Health issues with crossed leg posture: మీరు సాధారణంగా ఇంట్లో కానీ లేదా ఆఫీసులో రిలాక్స్‌డ్ మూడ్‌లో ఉన్నప్పుడు ఎలా కూర్చుంటారనే దానిపై మీరు ఎప్పుడైనా దృష్టిసారించారా ? మనలో చాలా మందిని ఒక కాలుపై మరొక కాలు వేసి అంటే క్రాస్ లెగ్ వేసి కూర్చోవడం చూస్తుంటాము. ఇలా కూర్చోవడం చాలా స్టైలిష్‌గా, ఎంతో హుందాగా, మరింత సుఖంగా కూడా ఉంటుంది. కానీ ఇలా కూర్చోవడం వల్ల హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు ( Health care experts ). Also read : Health benefits of eggs: రోజూ 2 గుడ్లు తింటే కలిగే లాభాలు ఏంటో తెలుసా ?

Imapcts on Blood pressure రక్తపోటుపై ప్రభావం చూపించే క్రాస్ లెగ్ పోస్టర్:
ఇలా కూర్చోవడం వల్ల రక్తపోటు పెరగడం లాంటి అనేక సమస్యలకు దారి తీస్తుంది అని మనలో చాలామందికి తెలియదు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఎక్కువసేపు క్రాస్ లెగ్ పోజులో కూర్చుంటే, నరాలపై ఒత్తిడి పెరిగి రక్తపోటు పెరుగుతుందని తమ అధ్యయనాల్లో తేలిందని పరిశోధకులు చెబుతున్నారు. రక్తపోటు సమస్యలు లేనివారు కూడా ఈ భంగిమలో ఎక్కువసేపు కూర్చోరాదు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. Also read : 
CoronaVirus: కళ్లద్దాలు ధరిస్తే ఎంత వరకు ప్రయోజనం ఉందంటే!

Peroneal nerve paralysis పెరోనియల్ నర్వ్ పెరాలిసిస్:
ఎక్కువ కాలం క్రాస్-లెగ్ పోజులో కూర్చోకూడదు అనడానికి మరొక కారణం పక్షవాతం లేదా పెరోనియల్ నరాల పక్షవాతం ( Peroneal nerve paralysis ). ఎక్కువసేపు.. అలా ఎక్కువ కాలం పాటు ఈ పోజులో కూర్చునే అలవాటు వల్ల నరాలు అణిగిపోయి దెబ్బతింటాయి. ఫలితంగా నరాల పక్షవాతానికి దారితీస్తాయి. Also read : 
Sitaphal benefits: సీతాఫలం తింటే కలిగే లాభాలు, నష్టాలు

Blood circulation రక్త ప్రసరణపైనా ప్రభావం :
ఒక కాలు మీద మరొక కాలు వేసినపుడు గుండె నుండి పాదాల వరకు రక్త ప్రసరణ సాఫీగా జరగకపోవడం వల్ల కాళ్లలో ఒక రకమైన మంటగా ( Burning sensation ) అనిపిస్తుంది. అలాగే నరాలపై ఒత్తిడి కూడా పెరుగుతుంది. వీటితో పాటు పెల్విక్ సమస్యలకు ( Pelvic issues ) కూడా దారితీస్తాయి. ఇంకొంత మందిలో మోకాళ్ల నొప్పుల సమస్యలకు ( Knee pains ) దారి తీసే ప్రమాదం లేకపోలేదు అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. Also read : 
Hair fall control, Dandruff: జుట్టు రాలడం: చుండ్రు వల్ల జుట్టు రాలుతుందా ?

ఇవన్ని సమస్యలకు చెక్ పెట్టాలాంటే ఏ స్థితిలో కూర్చున్నా కూడా, ఎక్కువసేపు ఒకే స్థానంలో కూర్చోకుండా మధ్య మధ్యలో భంగిమలు ( Sitting poses ) మారుస్తూ ఉండాలి. అప్పుడు మీరు కూర్చునే విధానం మీ ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపించకపోగా.. శరీరంలో కదలికల వల్ల మేలు కూడా కలుగుతుందని సూచిస్తున్నారు. అంతేకదా.. ఒకే చోట కదలకుండా కూర్చోవడం కంటే.. తరచుగా అటు ఇటు కదులుతుంటే శరీరానికి కూడా ఒక రకమైన వ్యాయమం అవుతుంది కదా అనేది వారి భావన. Also read : Coronavirus: కరోనావైరస్ నుంచి కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను శుభ్రపరచడం ఎలా ?

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం...

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News