ఆధునిక జీవనశైలిలో మార్పుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మూడింట ఒక వంతు ప్రజలు హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటు(Blood Pressure) సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే బీపీ కారణంగా గుండె సంబంధిత సమస్యలు బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు, పానియాలు, పండ్లు తీసుకోవడం ద్వారా రక్తపోటును కొంత మేర తగ్గించి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. టీ తాగడం ద్వారా కొంత సమయం వరకు బీపీ స్వల్పంగా తగ్గుతుందని తెలుసా.
నారింజ, నిమ్మకాయ మరియు ద్రాక్షపండ్లు వంటి పుల్లగా ఉండే పండ్లను తినడం వల్ల మీ గుండెకు మేలు జరుగుతుంది. ద్రాక్షపండ్లు తినడం ద్వారా రక్తపోటు ఉన్న పేషెంట్లలో సిస్టోలిక్ రక్తపోటు మరియు డయాస్టొలిక్ రక్తపోటు(High Blood Pressure) తగ్గుతుందని కొన్ని అధ్యయనాలలో తేలింది. ద్రాక్షపండులో విటమిన్ సి, పెక్టిన్ ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. నారింజ రసంతో పోల్చితే, ద్రాక్షపండు రసం ధమనులపై ఒత్తిడి తగ్గిస్తుందని పరిశోధకులు తెలిపారు.
Also Read: Covid-19 Deaths: ఎండలకు, కరోనా మరణాలకు ఉన్న లింక్‌పై నిపుణులు తేల్చిన విషయం ఇదే
దానిమ్మ జూస్‌లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ హైపర్‌టెన్సివ్ (ఒత్తిడిని తగ్గించే) లక్షణాలు ఉన్నాయి. దానిమ్మ రసం తాగితే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్‌ని నియంత్రించడం ద్వారా అధిక రక్తపోటు అభివృద్ధి చెందకుండా నిరోధించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. దానిమ్మ జూస్ మరియు దాని విత్తనాల ద్వారా తీసిన నూనెలోనూ రక్తపోటుపై ప్రభావం చూపే లక్షణాలున్నాయి. ప్రతిరోజూ 50-200 మిల్లీలీటర్ల దానిమ్మ రసం తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
రక్తపోటును నియంత్రించడంలో పొటాషియం కీలక పాత్ర పోషిస్తుంది. అరటిపండు(Banana Benefits)లో పోటాషియం, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, సోడియం యొక్క ప్రభావాలను తగ్గించడం ద్వారా రక్తనాళాల గోడలలో రక్త ప్రవాహాన్ని తగ్గించడానికి పొటాషియం దోహదం చేస్తుంది. పెద్దవారు రోజూ 4,700 మిల్లీగ్రాముల పొటాషియం తినాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. సాధారణంగా అరటిపండు తింటే మీకు సుమారు 422 మి.గ్రా పొటాషియం అందుతుంది. తద్వారా అధిక రక్తపోటు(High Blood Pressure) అదుపులోకి వస్తుంది.
Also Read: New Coronavirus Symptoms: కరోనా వైరస్ కొత్త లక్షణాలు ఇవే, కనిపిస్తే టెస్టులు తప్పనిసరి
వెల్లుల్లి యాంటీ హైపర్‌టెన్సివ్ లక్షణాలు కలిగి ఉంటుంది. వంటింట్లో మనకు అందుబాటులో ఉండే ఆహార పదార్థం వెల్లుల్లి. ఇందులో సల్ఫర్ అధికంగా లభిస్తుంది. సల్ఫర్ మిశ్రమానికి రక్తపోటు తగ్గించే లక్షణాలు ఉన్నాయని అధ్యయనాలలో తేలింది. కొన్ని అధ్యయనాలు అయితే వెల్లుల్లితో తయారుచేసే మందులు రక్తపోటును నియంత్రించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook