Breast Cancer: ఈ గింజను తింటే రొమ్ము క్యాన్సర్ తగ్గుతుందట..!

Breast Cancer Prevention:  మహిళలల్లో ఎక్కువగా వచ్చే వ్యాధి రొమ్ము క్యాన్సర్. మన జీవనశైలిలో మార్పులే  దీనికి కారణం. దీనిని మనం ఈ గింజలతో కూడా నివారించవచ్చు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 26, 2022, 12:04 PM IST
Breast Cancer: ఈ గింజను తింటే రొమ్ము క్యాన్సర్ తగ్గుతుందట..!

Flaxseed For Breast Cancer: రొమ్ము క్యాన్సర్ ముఖ్యంగా మహిళల్లో వస్తుంది. 40 ఏళ్ల దాటిన మహిళలు ఎక్కువగా ఈ క్యాన్సర్ బారిన పడతారు. ఊబకాయం లేదా అధిక బరువు ఉన్న వ్యక్తుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధిక కొవ్వు కలిగిన ఆహారం తినడం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మన దేశంలో చాలా మంది మహిళలు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. మన జీవనశైలిలో మార్పులే దీనికి కారణం. ఈ క్యాన్సర్ బయోప్సీ, మామోగ్రఫీ, పెట్ స్కాన్ వంటి పరీక్షల్లో బయటపడుతుంది. ఒక వేళ క్యాన్సర్ నిర్ధారణ అయితే కీమోథెరపీ, రేడియోథెరపీ, శస్త్రచికిత్స, హర్మోన్ థెరపీ వంటి చికిత్సల ద్వారా దీనిని  తగ్గిస్తారు. 

అవిసె గింజలతో క్యాన్సర్ కు చెక్...
రొమ్ము కాన్యర్ నివారణకు అవిసె గింజల అద్భుతంగా పనిచేస్తాయని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. ఫ్లాక్స్ సీడ్ క్యాన్సర్ నివారించే గుణాన్ని కలిగి ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. ఫ్లాక్స్ సీడ్ వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి.  వీటిని అనేక రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. ఈ అవిసె గింజల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో ప్రొటీన్, కాల్షియం, విటమిన్ సి, ఐరన్, విటమిన్ బి, మెగ్నీషియం, ఫాస్పరస్ మరియు ఫోలేట్ పుష్కలంగా లభిస్తాయి, అందుకే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా ఫ్లాక్స్ సీడ్లో  ఫైబర్, లిగ్నన్స్, యాంటీఆక్సిడెంట్లు లేదా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో వీటిని ఎక్కువగా ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఇది రొమ్ము క్యాన్సర్ ను నివారిస్తుంది. 

Also Read: Blood Pressure: ప్రాణాంతకమైన అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం ఎలా 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News