Summer Tips: వేసవి కాలంలో ఎండ, వేడి కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఎదురవుతాయి. ముఖ్యంగా వేసవిలో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ డీహైడ్రేట్ నుంచి రక్షణ పొందేందుకు మీ శరీరానికి తగినన్ని నీరు, పానీయాల అందించాల్సి ఉంటుంది. వీటి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. వేసవిలో ఆరోగ్యవంతంగా ఉండేందుకు శరీరానికి మంచి ఆహారం అందిచడమే కాకుండా పోషక విలువలున్న పండ్లను కూడా తీసుకుంటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఎండలో వెళ్లే సమయాల్లో తగు జాగ్రత్తలు పాటించాలని వారు చెబుతున్నారు. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటానికి పలు సూచనలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వేసవిలో వీటిని తినండి:
ద్రాక్ష:
వేసవిలో ద్రాక్షపండ్లు విచ్చల విడిగా మార్కెట్లలో విక్రయిస్తారు. మీరు వాటిని వేసవిలో తప్పనిసరిగా తినాలి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు మొదలైనవి ఉంటాయి. కావున ఎండలోకి వెళ్లే ముందు ద్రాక్షను తినడం ద్వారా ఇది మీ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.
డార్క్ చాక్లెట్:
వేడిని నుంచి రక్షణ పొందేందుకు డార్క్ చాక్లెట్‌ని తీనొచ్చని నివుణులు తెలుపుతున్నారు. చాక్లెట్‌ని తీసుకోవడం ద్వారా రోజంతా చురుకుగా ఉండడమే కాకుండా..శరీరాన్ని అలసిపోకుండా చేస్తుంది.
దానిమ్మ:
దానిమ్మ తినడం వల్ల ఎండలో వెళ్లినపుడు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇందులో ఉండే ఐరన్.. ఎర్ర రక్త కణాలను పెంచడానికి సహాయపడుతుంది. దీని వల్ల శరీరంలో రక్తం కొరతను తగ్గిస్తుంది.
నీరు:
వేసవిలో నీరు దివ్యౌషధం వంటిది. వేసవిలో శరీరాన్ని ఎండ నుంచి కాపడేందుకు నీరు ఎంతగానో ఉపయోగపడుతాయి. రోజంతా ఎప్పటికప్పుడు నీటిని తాగుతూ ఉండాలి. దీంతో మీ రక్త ప్రసరణ సరిగ్గా జరగడమే కాకుండా..చర్మంతో పాటు, మొత్తం శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Groom Funny Video: ఎవరో పటాకులు పేల్చారు వరుడిని గుర్రం ఎత్తుకెళ్లింది..!
Also Read: Jammu Kashmir Bus Fire: వైష్ణోదేవి భక్తులతో వెళుతున్న బస్సులో మంటలు..నలుగురు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook