Cure Diabetes with Neem Leaves: రోజు ఖాళీ కడుపుతో పచ్చి వేపాకులు తింటే నెలలో డయాబెటిస్ బై బై చెప్పొచ్చు!

Say Bye Bye to Diabetes : డయాబెటిస్ అనేది ఇటీవలి కాలంలో ఓ సాధారణ సమస్యగా మారిపోయింది. ప్రకృతిలో లభించే వివిధ రకాల మొక్కల్లో మధుమేహం నియంత్రించే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ప్రధానమైంది వేపాకులు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 8, 2023, 01:01 PM IST
Cure Diabetes with Neem Leaves: రోజు ఖాళీ కడుపుతో పచ్చి వేపాకులు తింటే నెలలో డయాబెటిస్ బై బై చెప్పొచ్చు!

Cure Diabetes with Neem Leaves in a Month: ఆధునిక జీవనశైలిలో ప్రధానంగా కన్పిస్తున్న సమస్య డయాబెటిస్. ఈ వ్యాధి ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ వశపర్చుకుంటోంది. డయాబెటిస్ అనేది ఒకసారి తగులుకుంటే నిర్మూలన అసాధ్యం. నియంత్రణ సాధ్యమే. దీనికోసం చాలా రకాల ప్రకృతి ఔషధాలు సిద్ధంగా ఉన్నాయి. 

ఇందులో ముఖ్యమైంది వేపాకులు. వాస్తవానికి వేపాకులతో డయాబెటిస్ ఒక్కటే కాదు చాలా రకాల వ్యాధులు దూరమౌతాయి. వేపాకుల్లో ఉండే యాంటీ డయాబెటిక్ గుణాలు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తాయి. అందుకే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించాలంటే రోజూ వేపాకులు తీసుకోవల్సిందే. డయాబెటిస్ రోగులకు వేపాకులు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం..

డయాబెటిస్ రోగులు ప్రతిరోజూ ఉదయం 6 వేపాకుల్ని సేవించాలి. ఈ ఆకుల్ని పరగడుపున నమిలి తినాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గి డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఒకేసారి 6 ఆకుల్ని నమలడం కష్టమైతే మూడు ఆకులు నమిలి ప్రారంభించండి. లేదా వేపాకుల్ని నీళ్లలో ఉడకబెట్టి చల్లారిన తరువాత ఆ నీళ్లను వడకాచి తాగవచ్చు. గ్లాసు నీళ్లలో కొన్ని వేపాకుల్ని వేసి బాగా ఉడికించాలి. ఎంతలా ఉంటే నీళ్లు సగానికి తగ్గిపోవాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వేపాకుల నీళ్లు తాగడం వల్ల చాలా సమస్యలు దూరమౌతాయి.

డయాబెటిస్ నియంత్రణకు వేపాకుల్ని దంచి వాటి నుంచి రసం పిండుకుని తాగాలి. చాలా చేదుగా ఉన్నా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రసాన్ని తాగడం వల్ల షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. చాలా వ్యాధులు దూరమౌతాయి. అందుకే వేపాకుల్ని రోజూ క్రమం తప్పకుండా సేవిస్తే మంచి ఫలితాలుంటాయి.

Also Read: White Salt Vs Rock Salt: హెల్త్‌కి రాక్‌ సాల్ట్‌ బెస్టా, వైట్‌ సాల్ట్‌ బెస్టా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News