Over Sleep Problem: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజు తగినంత నిద్ర ఉండాలంటారు. రోజుకు 7-8 గంటల నిద్ర అనేది చాలా అవసరం. నిద్ర తక్కువైతే చాలా రకాల అనారోగ్య సమస్యలు క్రమక్రమంగా వెంటాడుతుంటాయి. అదే సమయంలో నిద్ర ఎక్కువైనా ప్రమాదకరమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు.
రోజూ తగినంత నిద్ర ఉండటం వల్ల రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. రోజంతా పడిన అలసట అంతా దూరమైపోతుంది. తాజాదనం ఫీలవుతుంటారు. అందుకే రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్ర ఉంటే వివిధ రకాల సమస్యలు చుట్టుముడుతుంటాయి. నిద్ర మంచిది కదా అని ఎక్కువ సేపు కూడా నిద్రపోకూడదు. కొంతమంది అదే పనిగా నిద్రపోతుంటారు. ఎంత నిద్రపోయినా సరిపోదు. ఇంకా నిద్ర వస్తూనే ఉంటుంది. ఆవలింతలు వస్తుంటాయి. గంటల తరబడి నిద్రపోతుంటారు. అంటే మోతాదుకు మించి నిద్ర పోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రమాదకర అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు. అతి నిద్ర అనేది ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. కొన్ని ప్రమాదకర వ్యాధులకు సంకేతం కాగలదంటారు.
అతిగా నిద్రపోతున్నారంటే దానర్ధం మీ శరీరంలో ఫిజికల్ యాక్టివిటీ లేదని అర్ధం. అంటే కడుపు, పొట్ట, నడుము చుట్టూ కొవ్వు పెరిగిపోతుంది. క్రమ క్రమంగా ఇది డయాబెటిస్, అధిక రక్తపోటు సమస్యకు దారితీస్తుంది. అందుకే అతి నిద్ర మంచిది కాదు. అతి నిద్రను మీరు నియంత్రించుకోలేకపోతే వైద్యుని సంప్రదించడం మంచిది.
రోజుకు కావల్సిన 7-8 గంటల తరువాత కూడా నిద్ర సరిపోకపోతుంటే ఇది ప్రమాదకరం కావచ్చు. కుటుంబసభ్యుల మద్దతుతో నిద్రపోకుండా ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే అతిగా నిద్రించడం వల్ల గుండె వ్యాధుల సమస్య రావచ్చు. కరోనరీ ఆర్టరీ డిసీజ్ ముప్పు పెరిగిపోతుంది.
నిద్ర తక్కువైతే ఆందోళన, ఒత్తిడి సమస్యలు ఎదురౌతాయి. కానీ అతిగా నిద్రించడం కూడా ఈ తరహా సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా మానసిక సమస్యలు వెంటాడవచ్చు. నిద్రను నియంత్రించుకోలేకపోతే డిప్రెషన్‌కు గురికావచ్చు. అందుకే అతి నిద్ర అనేది మంచిది కాదు. రోజూ తగినంత నిద్ర ఉంటే అలసట వంటివి దూరమై తలపోటు సమస్య ఉత్పన్నం కాదు. ఎందుకంటే శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. అదే అతిగా నిద్రపోయినా తలపోటు సమస్య రావచ్చు. అతి నిద్ర అనేది మంచి అలవాటు కానే కాదు. ప్రమాదకర వ్యాధులకు దారి తీయవచ్చు. అదే సమయంలో అప్పటికే మీకు తెలియకుండా ప్రమాదకర వ్యాధులుండి ఉంటే అతి నిద్ర సమస్య ఉంటుంది. అందుకే ఈ సమస్య ఉన్నప్పుడు వైద్యుడిని సంప్రదించి తగిన పరిష్కారం చేయించుకోవాలి.
Also read: Jogging Health Benefits: రోజుకు కేవలం 30 నిమిషాల జాగింగ్, గుండె, డయాబెటిస్ అన్ని సమస్యలకు సమాధానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook