Kindey Problems: కిడ్నీల పనితీరు శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే కిడ్నీలు సరిగ్గా పనిచేయకుంటే శరీరంలోని విష పదార్ధాలు బయటకు వెళ్లక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేట్టు ఎప్పటికప్పుడు చూసుకోవాలి.
శరీరంలోని వ్యర్ధాలు, మలినాలను ఫిల్టర్ చేయడమే కిడ్నీల ప్రధాన విధి. ఫిల్టర్ చేసిన తరువాత మిగిలిన మలినాలు, విష పదార్ధాలు యూరిన్, మలం రూపంలో శరీరం నుంచి బయటకు వైదొలగిపోతాయి. ఫలితంగా వివిధ రకాల వ్యాధులు దూరంగా ఉంటాయి. కిడ్నీలకు ఇంతటి ప్రాముఖ్యత ఉన్నందునే కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కిడ్నీవ్యాధి ప్రారంభ లక్షణాలను గుర్తించడం చాలా కష్టం. అందుకే కిడ్నీ వ్యాధిని సైలెంట్ కిల్లర్ గా పరిగణిస్తారు. కిడ్నీలో సమస్య ఉంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి.
కిడ్నీలో సమస్య ఏర్పడితే శరీరంలో తీవ్ర బలహీనత ఏర్పడుతుంది. శారీరక శ్రమ కష్టమైపోతుంది. ఏ చిన్న పని చేసినా అలసిపోతుంటారు. రోజువారీ దినచర్యపై ఇది ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా మడమ, కాళ్లు, మోకాళ్లలో స్వెల్లింగ్ కన్పిస్తుంది. కిడ్నీలో సమస్య ఉంటే ఆకలి కూడా మందగిస్తుంది. యూరియా, క్రియేటినిన్, యాసిడ్ వంటి విష పదార్ధాలు శరీరంలో పేరుకుపోతాయి. ఫలితంగా ఆకలి మందగిస్తుంది. క్రమంగా శరీర బరువు తగ్గిపోతుంది.
కిడ్నీలో సమస్య ఏర్పడితే ఎడిమా వ్యాధికి దారితీస్తుంది. ఇందులో కంటి చుట్టుపక్కల స్వెల్లింగ్ ఉంటుంది. సెల్స్‌లో లిక్విడ్ వల్ల ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. కిడ్నీలు దెబ్బతింటే వాంతులు, వికారం సమస్యలుంటాయి.
కిడ్నీలను ఎలా రక్షించుకోవాలి
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు సమృద్ధిగా తాగాల్సి ఉంటుంది. సాధ్యమైనంతవరకూ గోరు వెచ్చని నీళ్లు తాగడం మంచిది. ఫలితంగా శరీరం నుంచి యూరియా, సోడియం వంటి విష పదార్ధాలు బయటకు వైదొలగుతాయి.
శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ చెక్ చేయించుకుని తగిన చర్యలు తీసుకోవాలి. ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. సాధ్యమైనంతవరకూ తాజా పండ్లు, ఆకు కూరలు తీసుకోవాలి. బరువు నియంత్రణలో ఉండేట్టు చూసుకోవాలి.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పు తక్కువగా సేవించాలి. ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రోసెస్డ్ ఫుడ్స్ పూర్తిగా మానేయాలి. ఎందుకంటే వీటిలో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి.
Also read: Fennel Water: వేసవిలో రోజూ ఈ నీళ్లు తాగితే డీ హైడ్రేషన్ సమస్యే ఉండదు<
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook