Cholesterol Tips: శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్. ఇందులో ఎల్‌డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవడం మంచిది. శరీరంలో కొన్ని లక్షణాలు కన్పిస్తే వెంటనే అప్రమత్తం కావడం అవసరం..ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం..
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలని వైద్యులు ఎప్పటికప్పుడు సూచిస్తుంటారు. లేకపోతే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. హై కొలెస్ట్రాల్ అనేది తీవ్రమైన వ్యాధే కానీ అప్రమత్తంగా ఉంటే నియంత్రించుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రధాన కారణం ఆధునిక జీవనశైలి. చాలా సందర్భాల్లో శరీరంలో కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు లక్షణాలు కన్పించకపోవడంతో ఆరోగ్యానికి హాని చేకూరుతుంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఉంటుంది. ఫలితంగా చెడు కొలెస్ట్రాల్ రక్తంలో పేరుకుపోతుంటుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఉంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి.
కిడ్నీ డ్యామేజ్
శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే కిడ్నీ ధమనుల్లో సైతం ప్లక్ పేరుకుపోతుంది. దాంతో కిడ్నీ వరకూ రక్తం సరఫరా కాదు. రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది. పర్యవసానంగా కిడ్నీలు విఫలమౌతుంటాయి. శరీరానికి ఫిల్టర్‌లా పనిచేసే కిడ్నీలు విఫలమైతే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తి ప్రాణాంతకం కాగలదు.
రక్త వాహికల బ్లాకేజ్
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే రక్త వాహికల్లో పేరుకుపోతుంది. ఫలితంగా రక్త సరఫరాపై ప్రభావం కన్పిస్తుంది. ధమనులు సంకోచించడం వల్ల శరీరంలోని చాలా భాగాలకు రక్తం సరిగ్గా సరఫరా కాదు. ఫలితంగా నష్టం కలుగుతుంది.
అధిక రక్తపోటు
హై కొలెస్ట్రాల్ కారణంగా శరీరంలోని ధమనుల్లో రక్త సరఫరాకు ఆటంకం కలుగుతుంది. ఫలితంగా ఒత్తిడి పెరిగి అథిక రక్తపోటుకు కారణమౌతుంది. ఆర్టరీస్ ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా అవుతుంటుంది. బ్లాకేజ్ ఏర్పడితే రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడతాయి.
గుండె వ్యాధులు
హై కొలెస్ట్రాల్ కారణంగా కరోనరీ ఆర్టరీలో ప్లాక్స్ ఏర్పడతాయి. ఫలితంగా హాల్ట్ మజిల్స్‌లో రక్త సరఫరా తగ్గుతుంది. దాంతో అధిక రక్తపోటు సంభవిస్తుంది. అందుకే తరచూ ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి ప్రమాదకర వ్యాధులు ఏర్పడవచ్చు.
Also read: Healthy Heart: గుండె ఆరోగ్యానికి ఏ పదార్ధాలు తినాలి, ఏవి తినకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook