Ghee Benefits: సంపూర్ణమైన ఆరోగ్యం కావాలంటే నెయ్యి తప్పకుండా తినాలంటారు. నెయ్యి అనేది కేవలం వంటల రుచిని పెంచేందుకే కాకుండా బలమైన ఆహారంగా పనిచేస్తుంది. నెయ్యి రోజూ తీసుకునే అలవాటుంటే స్థూలకాయం సైతం అదుపులో ఉంటుంది. అంటే బరువు తగ్గించేందుకు నెయ్యి అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. నెయ్యి తినడం వల్ల శరీరంలోని ఎముకలు, కండరాలు పటిష్టంగా మారతాయి. అదే సమయంలో అతి ముఖ్యమైన కొలెస్ట్రాల్ నియంత్రించేందుకు నెయ్యి చాలా బాగా ఉపయోగపడుతుంది.
నెయ్యిలో విటమిన్ ఇ, విటమిన్ ఎ, విటమిన్ కేతో పాటు ఒమేగా 3, ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఫలితంగా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. నెయ్యిని ఏ సీజన్ లో అయినా తీసుకోవచ్చు. చలికాలంలో, వర్షాకాలంలో, వేసవిలో తినవచ్చు. వేసవిలో మాత్రం కాస్త మితంగా వాడాలి. ఎందుకంటే నెయ్యి స్వభావం వేడి చేసేది కావడంతో ఎండాకాలంలో తక్కువగా తీసుకుంటే మంచిది. విటమిన్ ఇ పుష్కలంగా ఉండే నెయ్యి తినడం వల్ల ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్, ఆర్ధరైటిస్ సమస్యల్ని తగ్గిస్తాయి.
ఆరోగ్యపరంగా ఇన్ని ప్రయోజనాలున్న నెయ్యితో దుష్పరిణామాలు కూడా లేకపోలేదు. కొంతమంది మాత్రం నెయ్యికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్య ఉన్నవాళ్లు నెయ్యి తినకూడదు. గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణ సమస్యలవారు కూడా నెయ్యికి దూరంగా ఉండాలి. లేకపోతే కడుపు నొప్పి తీవ్రమై బాధిస్తుంది. మరోవైపు కాలేయం సమస్యలున్నవాళ్లు కూడా నెయ్యికి దూరంగా ఉండాలి. కాలేయ వ్యాధి ఉన్నప్పుడు సహజంగానే కాలేయం సామర్ధ్యం తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో నెయ్యి తీసుకోవడం వల్ల జీర్ణం కావడం సమస్యగా మారుతుంది. మరీ ముఖ్యంగా లివర్ సిరోసిస్, స్పైనోమొగలీ, హెపటోమొగలీ, హెపటైటిస్ రోగులు నెయ్యిని పూర్తిగా వదిలేయాయాలి.
గర్బిణీ మహిళలు కూడా నెయ్యి తినకూడదంటారు. నెయ్యి తినడం వల్ల గర్భిణీల్లో బరువు పెరిగే ప్రమాదముంది. అందుకే నెయ్యి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
Also read: Health Tips: రోజూ ఆ ఒక్కటి తీసుకుంటే చాలు అన్ని అనారోగ్య సమస్యలకు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook