Kidney Care Tips: డైట్‌లో ఇలా మార్పులు చేసుకుంటే కిడ్నీ సమస్యలకు చెక్

Kidney Care Tips: మనిషి శరీరంలో గుండె ఎంత ముఖ్యమైందో కిడ్నీలు అంతే ప్రాధాన్యత కలిగినవి. కిడ్నీలు విఫలమైతే ప్రాణాలే పోతాయి. అందుకే కిడ్నీల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 20, 2023, 06:14 PM IST
Kidney Care Tips: డైట్‌లో ఇలా మార్పులు చేసుకుంటే కిడ్నీ సమస్యలకు చెక్

Kidney Care Tips: ఆధునిక జీవన శైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్లే అనారోగ్యానికి కారణమౌతుంటాయి. గుండెతో పాటు కిడ్నీల పనితీరు బాగుంటేనే ఆరోగ్యం ఉంటుంది. కిడ్నీల సంరక్షణ ఎలా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా పరిశీలిద్దాం..

మనిషి ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషించేది కిడ్నీలు. ఎందుకంటే రక్తాన్నిశుభ్రపర్చడం గానీ లేదా తినే ఆహార పదార్ధాల్లో వ్యర్ధాల్ని, విష పదార్ధాల్ని తొలగించడంలో కిడ్నీల పాత్ర చాలా కీలకం. అందుకే కిడ్నీల్ని ఎప్పటికప్పుుడు ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి. శరీరంలో వ్యర్ధాల్ని డీటాక్స్ చేసేది కిడ్నీలే. కిడ్నీల్లో ఏ చిన్న సమస్య తలెత్తినా మొత్తం జీవక్రియపై ప్రభావం పడుతుంది. కిడ్నీలు కుదించుకుపోవడం, సరిగ్గా పనిచేయకపోవడం, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం అనేవి కిడ్నీ సంబంధిత సమస్యలు. అన్నింటికంటే ఎక్కువగా కన్పించేది కిడ్నీలో రాళ్ల సమస్య.

ఈ సమస్య చాలా మంది ఎదుర్కొంటున్నదే. దీనికి చికిత్స ఉంటుంది. కానీ, నివారణ ఎప్పుడూ మంచిది. కిడ్నీ రాళ్ల సమస్య అసలు రాకుండా చూసుకోవడం చాలా మంచిది. కిడ్నీలో రాళ్లు పడిన తర్వాత అసలు మన నిత్యజీవితంలో చిన్న మార్పులతో ఆ సమస్యను అధిగమించవచ్చు.

కిడ్నీలో రాళ్ల సమస్యకు పరిష్కారం ఎలా

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే ముఖ్యంగా కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. పాలు, పెరుగు, ఆకు కూరలు వంటివి రోజువారీ డైట్‌లో భాగంగా చేసుకోవాలి. లేదా కనీసం వారానికి 4 రోజులైనా ఉండాలి.  తినే ఆహారంలో ఉప్పు తగ్గించేయాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. వాటిలో లెమన్ సాల్ట్, ఇతరత్రా వినియోగం చాలా ప్రమాదం. కాబట్టి, జంక్ ఫుడ్‌ను వదిలేయాలి. శరీరంలో మెగ్నీషియం లెవెల్స్ పెంచుకోవాలి. క్యాల్షియం ఆక్సోలేట్ అనేది కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది.

ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. తరచూ మాంసం, పోర్క్, చికెన్, మటన్, చేపలు, గుడ్లు ఎక్కువగా తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ పెరగడం ఏ మాత్రం మంచిదికాదు.  ఫాస్పేట్ ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. 

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. కిడ్నీ సమస్య ఉంటే ఇదిక తప్పనిసరి. రోజుకు కనీసం 12 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. జ్యూస్‌లు కూడా రెగ్యులర్‌గా తాగుతూ ఉండాలి. పంచదార సాధ్యమైనంతవరకూ మానేయడం మంచిది. పంచదార స్థానంలో తప్పని పరిస్థితుల్లో బెల్లం వాడితే మంచిది.

Also read: Diabetes Tips: టైప్ 2 డయాబెటిస్ సమస్యకు అద్భుత ఔషధం, నెల రోజుల్లో మధుమేహానికి చెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News