Wheat Flour Roti: షుగర్ రోగులు గోధుమ రోటీలు తినడం మంచిదా కాదా, ఏ రోటీలు తింటే మంచిది

Wheat Flour Roti: డయాబెటిస్ ఓ ప్రమాదకర వ్యాధి. ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఇందుకు ప్రధాన కారణాలు. మదుమేహ వ్యాధిగ్రస్థులు ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు. ఎలాంటి ఆహారం తీసుకోకూడదనేది తెలుసుకోవడం చాలా అవసరం. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 23, 2023, 07:08 AM IST
Wheat Flour Roti: షుగర్ రోగులు గోధుమ రోటీలు తినడం మంచిదా కాదా, ఏ రోటీలు తింటే మంచిది

చాలామంది డయాబెటిస్ ఉన్నప్పుడు రాత్రి వేళ రోటీ తింటుంటారు. అయితే ఎలాంటి రోటీ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని రకాల రోటీలు తింటే మొదటికే మోసం వస్తుంది. డయాబెటిస్ శరీరంలో వేగంగా పెరుగుతుంటుంది. కొన్ని రకాల రోటీలతో బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. 

డయాబెటిస్ అనేది సాధారణంగా లైఫ్‌స్టైల్ వ్యాధి. అందుకే ప్రతి ఇంట్లో డయాబెటిక్ రోగి తారసపడుతుంటాడు. డయాబెటిస్ ఉన్నప్పుడు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ మాత్రం నిర్లక్ష్యం లేదా పొరపాటు వహించినా శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయి పెరిగిపోవచ్చు. ఫలితంగా మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డయాబెటిస్ రోగులు కొన్ని రకాల పిండితో చేసిన రోటీలే తినాల్సి వస్తుంది. అవేంటో తెలుసుకుందాం. వీటివల్ల మీ బ్లడ్ షుగర్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. 

గోధుమలకు చెక్ పెట్టాల్సిందే check to wheat flour

సాధారణంగా ప్రతి ఇంట్లో గోధుమ పిండితో చేసే రోటీలు ఎక్కువగా తింటుంటారు. కానీ గోధుమల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా డయాబెటిస్ రోగులు గోధుమ రోటీలు తీనడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయి వేగంగా పెరుగుతుంది. ఈ క్రమంలో హై ప్రోటీన్, ఫైబర్ ఉండే రోటీలు తినాల్సి వస్తుంది. ఫైబర్ అధికంగా ఉండి కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే రోటీల గురించి తెలుసుకుందాం..

జొన్న రొట్టెలు Sorghum roti

జొన్నల్లో డైటరీ ఫైబర్, మెగ్నీషియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. జొన్న కూడా ఓ రకమైన ధాన్యమే. ఇందులో గ్లూటిన్ ఉండదు. అందుకే జొన్న రొట్టెలు తినడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. 

శెనగ పిండి రోటీలు Gram Flour roti

లైఫ్‌స్టైల్ డయాబెటిస్‌తో బాధపడుతున్నవాళ్లు శెనగ పిండి రోటీలు తినడం చాలా మంచిది. శెనగల్లో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు గ్లూటిన్ ఉండదు. అందుకే శెనగ రోటీలు తినడం వల్ల బ్లడ్ షుగర్ పూర్తిగా నియంత్రణలో ఉంటుంది. 

రాగి పిండి రోటీలు Ragi Four roti

రాగిలో ఫైబర్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందుకే రాగులతో బరువు కూడా తగ్గుతారు. రాగి జావా లేదా రాగి పిండి రోటీలు తినడం డయాబెటిక్ రోగులకు చాలా ప్రయోజనకరం. రోజూ రాగి పిండి రోటీలు తినడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. 

ఆరోగ్య నిపుణుల ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 2 రోటీలు తీసుకోవాలి. అదే అధిక రక్తపోటు కలిగిన వ్యక్తి అయితే రోజుకు 6-7 రోటీలు తీసుకోవాల్సి ఉంటుంది. 

Also read: Cholesterol tips: రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఫ్రూట్స్ తీసుకుంటే..నెలరోజుల్లో కొలెస్ట్రాల్ మాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News