మధుమేహం ఎంత ప్రమాదకరమైందైనా నియంత్రణ మాత్రం మన చేతుల్లోనే ఉంది. కొన్ని మసాలా పదార్ధాలు క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహాన్ని సులభంగా నియంత్రించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
బ్లడ్ షుగర్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. ప్రతి నలుగురిలో ఒకరికి డయాబెటిస్ సోకుతుందంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. ఒకసారి డయాబెటిస్ సోకితే అంతమనేది ఉండదు. కానీ నియంత్రణ సాధ్యమే. జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకుంటేనే ఇది సాధ్యమౌతుంది. డయాబెటిస్ నియంత్రణకు కొన్ని మసాలా పదార్ధాల్ని డైట్లో తీసుకుంటే సులభంగా నియంత్రించవచ్చు.
అల్లం వినియోగంతో లాభాలు
శరీరంలో బ్లడ్ షుగర్ నియంత్రించేందుకు అల్లం ఉపయోగం అద్భుతంగా ఉంటుంది. అల్లం టీ రూపంలో తీసుకోవచ్చు. లేదా వేడి నీటిలో అల్లం ఉడికించి ఆ నీటిని తాగవచ్చు లేదా అల్లం చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉప్పు లేదా పెప్పర్‌తో సేవించవచ్చు. అల్లంలో ఉండే పోషక పదార్ధాలు రక్తంలో షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తాయి.
పసుపులో ఆయుర్వేద గుణాలు
పసుపు ఓ మసాలా పదార్ధమే కాకుండా ఆయుర్వేదపరంగా అద్భుతమైన ఔషధం. ఇందులో యాంటీ బయాటిక్, యాంటీ సెప్టిక్ గుణాలు అధికం. ఆరోగ్యానికి చాలా మంచిది. పాలలో పసుపు కలిపి తాగడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. లేదా కొంతమంది గోరువెచ్చని నీటిలో పసుపు కలుపుకుని తాగుతుంటారు.
ధనియాలతో ప్రయోజనాలు
బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించేందుకు ధనియాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇందులో పోషక గుణాలు చాలా ఎక్కువ. డయాబెటిస్ పెరగకుండా నియంత్రిస్తాయి. రాత్రి వేళ నీళ్లలో నానబెట్టిన ధనియాలను మరుసటి రోజు వడపోసి తాగాలి. దీనివల్ల చాలా ప్రయోజనాలున్నాయి.
దాల్చిన చెక్కతో ప్రయోజనాలు
డయాబెటిస్ నియంత్రించేందుకు దాల్చినచెక్క అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. దాల్చినచెక్క తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నెమ్మది నెమ్మదిగా నియంత్రణలో వస్తాయి. దాల్చినచెక్క టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. దీంతో మెంతుల్ని చేర్చితే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి.
Also read: Heart Attack Risk: ఈ మూడు చెడు అలవాట్లే గుండెపోటుకు ప్రధాన కారణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook