Sweet Potato: మధుమేహం వ్యాధిగ్రస్థులు స్వీట్ పొటాటో తినవచ్చా లేదా

Sweet Potato: మధుమేహం వ్యాధి ఇటీవలి కాలంలో ప్రమాదకరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా విస్తరిస్తున్న వ్యాధి ఇది. లైఫ్‌స్టైల్ వ్యాధిగా పరిగణించే మధుమేహాన్ని సకాలంలో నియంత్రించకపోతే ప్రాణాంతకం కూడా కావచ్చు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 9, 2023, 03:50 PM IST
Sweet Potato: మధుమేహం వ్యాధిగ్రస్థులు స్వీట్ పొటాటో తినవచ్చా లేదా

Sweet Potato: ఈ క్రమంలో మధుమేహం నియంత్రణలో అత్యంత కీలకమైంది ఆహారపు అలవాట్లు. మధుమేహం ఉంటే ఏవి తినవచ్చు, ఏవి తినకూడదనేది జాగ్రత్తగా పరిశీలించాలి. తీపి పదార్ధాలు లేదా స్వీట్స్ అనేవి పూర్తిగా దూరం పెట్టాల్సిందే. మరి ఆరోగ్యానికి మంచిదిగా భావించే స్వీట్ పొటాటో లేదా చిలకడ దుంప తినవచ్చా లేదా. ఈ సందేహం ఇప్పడు చాలామందిలో ఉంది.

చలికాలం వచ్చేస్తోంది. మార్కెట్‌లో చిలకడ దుంపలు ఎక్కువగా కన్పిస్తాయి. న్యూట్రిషన్లతో నిండి ఉండే చిలకడ దుంప వాస్తవానికి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. కానీ మధుమేహం వ్యాధిగ్రస్థులు స్వీట్ పొటాటో తినవచ్చా లేదా అనేది సందేహంగానే మిగిలిపోతోంది. ఎందుకంటే ఏ మాత్రం పొరపాటు జరిగినా బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోగలవు. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాంటిదే స్వీట్ పొటాటో. మధుమేహం వ్యాధిగ్రస్థులు దీనిని తినవచ్చా లేదా, డైటిషియన్లు ఏమంటున్నారు..

చిలకడ దుంపలో విటమిన్ ఎ, విటమిన్ బి , విటమిన్ సి, విటమిన్ డి, ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, హెల్తీ ఫ్యాట్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, కెరోటోనాయిడ్స్ , థయామిన్ వంటి కీలకమైన పోషకాలన్నీ ఉంటాయి. ఆరోగ్యానికి ఈ పోషకాలు చాలా ప్రయోజనకరం. అయితే స్వీట్‌గా ఉండే పదార్ధం కావడంతో మధుమేహం వ్యాదిగ్రస్థులకు తినవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది.

ఏదైనా పదార్ధాన్ని వండే విధానం బట్టి ఆ పదార్ధం గ్లైసెమిక్ ఇండెక్స్ పెరగడం లేదా తగ్గడం ఉంటుంది. జీఐ ఎక్కువగా ఉంటే మధుమేహం వ్యాధిగ్రస్థులకు మంచిది కాదు. స్వీట్ పొటాటోలో స్టార్చ్‌తో పాటు కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటమే కాకుండా యాంటీ ఇన్‌ఫ్లమేటరీగ గుణాలుంటాయి. ఈ రెండూ వాస్తవానికి మధుమేహం వ్యాదిగ్రస్థులకు మంచివే. అందుకే చిలకడదుంపను ఒలిచి ఉడకబెట్టి తింటే మధుమేహం వ్యాధిగ్రస్థులకు మంచిది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

కొంతమంది చిలకడ దుంపను ఆయిల్ ఫ్రై చేసి తింటారు. ఇది మంచి పద్ధతి కానే కాదు. దీనివల్ల రక్తంలో చక్కెర శాతం కచ్చితంగా పెరుగుతుంది. మధుమేహం వ్యాదిగ్రస్థులకు ప్రమాదకరం కూడా. అందుకే చిలకడ దుంప తినాలంటే ఉడకబెట్టి మాత్రమే తినాలి. అది కూడా వారంలో 1-2 సార్లు మాత్రమే.

Also read: Curry Leaves For BP: బీపీ కంట్రోల్‌ చేసే ఆకులు ఇవే..రోజు ఇలా చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News