Litchi Benefits: మనిషి శరీర ప్రక్రియలో అత్యంత కీలకమైంది మెటబోలిజం. మెటబోలిజం సరిగ్గా ఉంటే అన్ని చర్యలు సక్రమంగా సాగి మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. జీవక్రియలో ఇబ్బందులు ఏర్పడితే అది కాస్తా అన్ని అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే జీవక్రియ మెరుగుపర్చుకునే ఆహార పదార్ధాలపై దృష్టి అవసరం.
ప్రస్తుతం వేసవి సీజన్ నడుస్తోంది. వేసవి కారణంగా రకరకాల పండ్లు మార్కెట్లో లభ్యమౌతున్నాయి. ఇందులో కీలకమైంది లిచీ. ఇదొక వేసవి సీజనల్ ఫ్రూట్. లిచీ రుచిలో జ్యూసీగా, తీపిగా ఉంటుంది. లిచీ పండు ఆరోగ్యపరంగా చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా బరువు తగ్గించేందుకు, జీవక్రియ మెరుగుపర్చేందుకు లిచీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. వేసవి సీజనల్ ఫ్రూట్ లిచీ ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి చలవ చేయడమే కాకుండా మెటబోలిజం వృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ప్రత్యేకించి లిచీ తినడం వల్ల బరువు చాలా వేగంగా తగ్గుతుంది.
లిచీ ఫ్రూట్ ప్రయోజనాలు
లిచీ అత్యంత జ్యూసీ ఫ్రూట్ కావడంతో 80 శాతం శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. వేసవిలో ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఫ్రూట్ స్వీట్‌గా ఉన్నా సరే..దీనివల్ల బరువు తగ్గడం విశేషం. ఎందుకంటే ఇందులో ఫైబర్ మోతాదు ఎక్కువగా ఉండి జీర్ణక్రియ సులభమౌతుంది. లిచీ ఫ్రూట్ గుండె ఆరోగ్యానికి సైతం అద్భుతమైంది. ఇందులో ఉండే పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. లిచీలో అధికంగా ఉండే విటమిన్ సి కారణంగా ఇమ్యూనిటీ బలపడుతుంది. ముఖ్యంగా గర్భిణీ మహిళలకు లిచీ చాలా మంచిది. శరీరానికి కావల్సినంత ఐరన్ లభిస్తుంది.
లిచీలో పెద్దమొత్తంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.దాంతోపాటు యాంటీ ఏజీయింగ్ లక్షణాలు కలుగుతాయి. లిచీ క్రమం తప్పకుండా తినడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఫలితంగా గొంతులో గరగర, జ్వరం, జలుబు వంటి సమస్యలు దూరమౌతాయి. లిచీ ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరం. లిచీ తీసుకోవడం వల్ల చర్మానికి నిగారింపు వస్తుంది. లిచీ తినడం వల్ల లైంగిక జీవితం సైతం బాగుంటుంది.
Also read: Kallu vs Neera: కల్లుకు, నీరాకు తేడా ఏంటి? నీరా చెట్టు నుంచి ఎలా తీస్తారు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook