Best Drink for High BP: వాస్తవానికి అధిక రక్తపోటు సమస్యకు అల్లోపతీ వైద్యంలోనే కాదు ఇతర వైద్య విధానాల్లో కూడా మందులు అందుబాటులో ఉన్నాయి. కానీ వంటింటి చిట్కాలతో మరింత సులభంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చంటున్నారు. ఆరోగ్య నిపుణులు. అలాంటి హోమ్ మేడ్ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా అధిక రక్తపోటు సమస్య చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఆధునిక జీవన విధానంలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి ఇందుకు ప్రధాన కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం అధిక రక్తపోటు కలిగినవారిలో 54 శాతం మాత్రమే రోగ నిర్ధారణ జరిగింది. 42 శాతం మంది చికిత్స పొందుతున్నారు. 21 శాతం మందికి రక్తపోటు నియంత్రణలో ఉంది. అధిక రక్తపోటు సమస్య ఆరోగ్యానికి సంబంధించింది మాత్రమే. అందుకే రక్తపోటును నియంత్రణలో ఉంచకపోతే ప్రాణాంతకం కాగలదు.
అధిక రక్తపోటు అనేది మందులతో నియంత్రణలో ఉండే వ్యాధి. కానీ జీవితాంతం వాడాల్సి వస్తుంది. దీర్ఘకాలం బీపీ మందులు వాడటం అనేది ఇతర సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, జీవనశైలి సక్రమంగా ఉండేట్టు చూసుకోవడం చాలా అవసరం. అదే సమయంలో హోమ్ మేడ్ జ్యూస్ మంచి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.
బీట్‌రూట్ జ్యూస్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అధిక రక్తపోటు సమస్యను తగ్గించేందుకు బీట్‌రూట్ జ్యూస్ ఔషధంలాపనిచేస్తుంది. ఇందులో నైట్రేట్ అధికంగా ఉండటంతో రక్తపోటును నియంత్రిస్తుంది. రోజుకు కేవలం 250 మిల్లీలీటర్ల జ్యూస్ అంటే ఒక గ్లాసు తీసుకుంటే చాలు. అధిక రక్తపోటు సమస్య ఇట్టే పరిష్కారమౌతుంది. బీట్‌రూట్ జ్యూస్‌లో సహజసిద్ధమైన నైట్రేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి రక్త నాళాల్లోకి వ్యాపిస్తుంది. ఫలితంగా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్తపోటు తగ్గుతుంది.
బీట్‌రూట్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఈ జ్యూస్ సేవించడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా స్వెల్లింగ్, ఎనీమియా, లివర్ హెల్త్ వంటి ప్రయోజనాలకు కలగనున్నాయి. కిడ్నీలో రాళ్లుండేవాళ్లు, లో బీపీ సమస్య ఉండేవాళ్లు మాత్రం బీట్‌రూట్ జ్యూస్‌కు దూరంగా ఉండాలి.
Also read: AP Elections 2024: ఏపీలో సీన్ రివర్స్, ఏ జిల్లాలో ఎవరికెన్ని సీట్లు, ఆత్మసాక్షి గ్రూప్ తాజా సర్వే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook