Prediabetic Signs: ప్రీ డయాబెటిస్ స్థితి అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి

Prediabetic Signs: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. రక్తపోటు, మధుమేహం, కిడ్నీ వ్యాధులు, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణం ఆహారపు అలవాట్లే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 23, 2024, 10:06 PM IST
Prediabetic Signs: ప్రీ డయాబెటిస్ స్థితి అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి

Prediabetic Signs: బిజీ లైఫ్ కారణంగా చాలామంది ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ప్యాకెట్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు అలవాటు పడుతున్నారు. ఇది కాస్తా శరీరంలో వివిధ రకాల సమస్యలకు కారణమౌతోంది. ముఖ్యంగా మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఈ ఆాహారపు అలవాట్ల వల్లే మొదలవుతుంటాయి. మధుమేహం అనేది ఒకేసారి రాదు. ప్రీ డయాబెటిక్ స్థితి ఉంటుంది. ఈ స్థితిలో లక్షణాల్ని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి చేజారవచ్చు.

మధుమేహం అనేది ప్రస్తుతం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధి. మధుమేహంలో ప్రీ డయాబెటిక్ స్థితి దాటిన తరువాత ఎవరికైనా మధుమేహం సోకుతుంది. ప్రీ డయాబెటిక్ అంటే రక్తంలో చక్కెర స్థాయి బోర్డర్ లెవెల్స్‌లో ఉండటం. ఈ స్థితిలో కన్పించే లక్షణాలను సాధారణంగా చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. దాంతో ప్రీ డయాబెటిక్ స్థితి కాస్తా డయాబెటిక్‌గా మారుతుంది. శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉంటే ప్రీ డయాబెటిక్ అంటారు. సకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదకరం కాకుండా చేయవచ్చు. 

ప్రీ డయాబెటిక్ లక్షణాలు ఎలా ఉంటాయి

మసకగా కన్పించడం, కాళ్లు, చేతులు తిమ్మిరెక్కడం, దాహం ఎక్కువగా ఉండటం, తరచూ మూత్రానికి వెళ్లడం, ఆకలి పెరగడం, అలసట, తరచూ అనారోగ్యం కలగడం, గాయాలు త్వరగా మానకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. 

ప్రీ డయాబెటిక్ స్థితి నుంచి బయటపడాలంటే ముఖ్యంగా చేయాల్సింది బ్యాలెన్స్డ్ డైట్. అంటే మీరు తీసుకునే ఆహారంలో నిర్ణీత మోతాదులో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్ ఉండేట్టు చూసుకోవాలి. రిఫైండ్ షుగర్, శాచ్యురేటెడ్ ఫ్యాట్, ప్రోసెస్డ్ ఫుడ్ తగ్గించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఆహార పదార్ధాలు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను పెంచుతాయి. ఇలా కాకుండా ఉండేందుకు కొద్ది కొద్దిగా రోజుకు 4-5 సార్లు ఆహారం తీసుకోవాలి.

ప్రీ డయాబెటిస్ స్థితిని నియంత్రించేందుకు వ్యాయామం లేదా యోగా లేదా వాకింగ్ తప్పనిసరిగా ఉండాలి. రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ లేదా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. సైక్లింగ్ చేసినా ఫరవాలేదు. శారీరక శ్రమ ఉండేట్టు చూసుకోవాలి. తీసుకునే ఆహారం ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవడం ద్వారా హెల్తీ వెయిట్ ఉండేట్టు చూసుకోవాలి. బరువు అధికంగా ఉంటే క్రమంగా తగ్గించుకోవాలి. ఎందుకంటే స్థూలకాయం అనేది డయాబెటిక్ రోగులకు మంచిది కాదు. 

బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండాలి. ప్రతి పదిరోజులకోసారి బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేయడమే కాకుండా రీడింగ్ తనిఖీ చేస్తుండాలి. ఏయే ఆహార పదార్ధాలు తీసుకుంటే ఎలా ఉంటుందనేది పరిశీలించాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. రోజూ తగినంత నిద్ర తప్పకుండా ఉండాలి. ముఖ్యంగా రాత్రి నిద్ర 7-8 గంటలు తప్పకుండా ఉండాలి. అదే సమయంలో రోజూ తగినంత నీళ్లు తప్పకుండా తాగాలి. 

Also read: Health Tips: రోజూ గోరు వెచ్చని నీళ్లు తాగితే నమ్మలేని అద్భుతాలు చూడొచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News