Black Pepper benefits: మిరియాలను క్వీన్ ఆఫ్ స్పైసెస్ గా పిలుస్తారు. వంటల్లో రుచి ఉండాలంటే మిరియాల ఘాటు తగలాల్సిందే. అలాంటి మిరియాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల జబ్బులు దూరమవుతాయి. మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు అధికంగా ఉంటాయి. బ్లాక్ పెప్పర్లో చాలా రకాలున్నాయి. ఇవి నలుపు, తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో కూడా లభిస్తాయి. అయితే మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నల్ల మిరియాల (Black Pepper) ప్రయోజనాలు గురిచి తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్ పెరగదు
నల్ల మిరియాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. దీని ద్వారా మీకు గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
బరువు తగ్గిస్తుంది
ప్రస్తుతం మన జీవనశైలి కారణంగా ఎంతో మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీని నివారించాలంటే మీరు నల్ల మిరియాలను ఆహారంలో భాగంగా చేర్చుకోండి.
జలుబు, దగ్గుకు చెక్
నల్ల మిరియాలు జలుబు మరియు దగ్గును తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. నల్ల మిరియాలలో ఉండే పెప్పరైన్ అనే మూలకం దీనిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
కీళ్ల నొప్పులు మటుమాయం
కీళ్ల నొప్పులను తగ్గించడంలో నల్ల మిరియాలు బాగా సహకరిస్తాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎలిమెంట్స్ ఉంటాయి.
Also Read: Health Benefits Of Egg Yolk : గుడ్డు పచ్చసొన తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook