Benefits With Banana: అరటి పండుతో ఆశ్చర్యపోయే ప్రయోజనాలు

మన దిన చర్యలో భాగంగా రోజుకో ఆపిల్‌ పండు తింటే ఆరోగ్యంగా ఉంటామని..డాక్టర్‌ దగ్గరు వెళ్లాల్సిన అవసరం లేదని చాలా మంది చెప్తూ ఉంటారు. ఒక్క ఆపిల్‌ పండు మాత్రమే కాదు..మనం రోజుకు ఒక్క అరటి పండు తిన్నా మనం ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు సూచిస్తున్నారు. మార్కెట్‌లో చవకగా..అన్ని కాలాల్లో దోరికే అరటి పండ్లను అరగించడం వల్ల అనేక రోగాలకు దూరం ఉండవచ్చని వైద్యులు అంటున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 26, 2022, 05:03 PM IST
  • అరటి పండుతో చాలా ప్రయోజనాలు
  • అరటి పండుతో బీపీ అదుపులోనే ఉంటుందని వైద్యుల వెల్లడి
  • అరటి తినడం వల్ల ధృడంగా ఎముకలు
Benefits With Banana: అరటి పండుతో ఆశ్చర్యపోయే ప్రయోజనాలు

Benefits With Banana: అరటిపండ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అరటి పండు తినడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు కలుగుతుందని పలు పరిశోధనల్లో తేలింది. అయితే అరటిపండు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అరటిపండులో పొటాషియం..కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. వీటి వినియోగం వల్ల బీపీ అదుపులో ఉండడమే కాకుండా ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. అరటిపండును వేసవిలో శక్తికి ప్రధాన వనరుగా కూడా పరిగణిస్తారు. అందుకే కొంతమంది అరటిపండ్లను రోజూ తినడానికి ఇష్టపడతారు. మరి అరటిపండ్లు తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

అరటి పండుతో త్వరగా కడుపు నిండుతుంది

అరటిపండులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తింటే పొట్ట (కడుపు) త్వరగా నిండుతుంది. ఆఫీస్ లేదా కాలేజీకి వెళ్లడం వల్ల ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తూ ఉంటారు చాలా మంది. అయితే ఇలాంటి సమయంలో అరటి పండు తిన్నడం వల్ల తక్షణ శక్తిని ఇస్తుందని డాక్టర్లు సూచిస్తున్నారు. అరటి పండు సహజ సిద్ధమైన బూస్టర్స్‌లా పని చేస్తోంది. అరటి పండుతో ఉండే కార్బొహైడ్రైట్స్ శక్తని అందించి రోజంతా ఉత్సాహంగా పని చేసేందుకు సహకరిస్తాయి. అయితే షూగర్ వ్యాధితో బాధపడే వారు అరటి పండును తినకపోవడమే మంచిదని డాక్టర్లు చెప్తున్నారు.

ఒత్తిడి ఉండదు
ఒత్తిడిని తగ్గించడంలో అరటిపండు కూడా చాలా మేలు చేస్తుంది. నిజానికి, అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ అనే మూలకం కనిపిస్తుంది. ఈ ట్రిప్టోఫాన్ వల్ల మన శరీరంలో సెరోటోనిన్ తయారవుతుంది. సెరోటోనిన్‌ని హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది.

అరటి పండుతో జీర్ణ సంబంధిత సమస్యలు దూరం
జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేయడంలో కూడా అరటిపండు చాలా మేలు చేస్తుంది. నిజానికి.. అరటిపండులో ఉండే స్టార్చ్ మన జీర్ణవ్యవస్థకు ముఖ్యమైన మంచి బ్యాక్టీరియాకు మేలు చేస్తుంది. అరటిపండ్లు యాంటి యాసిడ్ కూడా, కాబట్టి మీకు గుండెల్లో మంట సమస్య ఉంటే, అరటిపండు తీసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది. జీర్ణ సమస్యతో బాధపడే వారు అరటి పండు తింటే మంచి ఫలితం ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. అదే విధంగా మల బద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు అరటి పండు తినడం ద్వారా మంచి ఫలితాలు ఉంటామని వైద్య నిపుణులు అంటున్నారు.

అరటి పండుతో ఎముకలు బలంగా ఉంటాయి
ఎముకలు దృఢంగా ఉండేందుకు అరటిపండును కూడా తీసుకోవాలి. 30 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత చాలా మంది ఎముకలలో నొప్పితో బాధపడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో, మీరు ప్రతిరోజూ ఒక అరటిపండు తినాలి. అరటి పండు క్యాన్సర్ కణాలతో పోరాడుతోందని డాక్టర్లు చెప్తున్నారు.

Also Read: Acharya First Review: ఆచార్య మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ఫ్యాన్స్ కు పూనకాలే!

Also Read: Governor Dispute: గవర్నర్ వ్యవస్థపై వివాదం, నిన్న తెలంగాణ, ఇవాళ తమిళనాడు..ఏది వాస్తవం

Also Read:  Solar Eclipse April 2022: సూర్యగ్రహణం రోజున చేయాల్సినవి, చేయకూడని పనులేంటి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News