Health Benefits of Napping: మధ్యాహ్నం నిద్రతో లాభమా.. నష్టమా? ఇది చదవండి

Health Benefits of Napping: మధ్యాహ్నం భోజనం చేశాక ఎందుకో తెలియదు కానీ కాస్త బద్దకంగా ఉంటుంది. స్కూలు విద్యార్థుల నుంచి జాబ్ చేసే ఉద్యోగుల వరకు అందరి నోటా ఈ మాట వింటూనే ఉంటాం. అయితే మధ్యాహ్నం ఓ చిన్న కునుకు (NAP)తీస్తే బాగుంటుంది అనుకుంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2021, 01:59 PM IST
  • మధ్యాహ్నం భోజనం చేశాక ఎందుకో తెలియదు కానీ కాస్త బద్దకంగా ఉంటుంది
  • భోజనం తర్వాత ఓ చిన్న కునుకు (NAP)తీస్తే బాగుంటుంది అనుకుంటారు.
  • మధ్యాహ్నం నిద్రించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఇవే:
Health Benefits of Napping: మధ్యాహ్నం నిద్రతో లాభమా.. నష్టమా? ఇది చదవండి

Health Benefits of Napping: మధ్యాహ్నం భోజనం చేశాక ఎందుకో తెలియదు కానీ కాస్త బద్దకంగా ఉంటుంది. స్కూలు విద్యార్థుల నుంచి జాబ్ చేసే ఉద్యోగుల వరకు అందరి నోటా ఈ మాట వింటూనే ఉంటాం. అయితే మధ్యాహ్నం ఓ చిన్న కునుకు (NAP)తీస్తే బాగుంటుంది అనుకుంటారు. నిజమే.. భోజనం తర్వాత నిద్ర ఆరోగ్యానికి శ్రేయస్కరమా లేక హాని చేస్తాయా అంటే ఈ విషయాలు తెలుసుకోవాలి. 

మధ్యాహ్నం భోజనం తర్వాత కాస్త కునుకు తీయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం కునుకు తీస్తే రాత్రి నిద్రరాదేమోనని కొందరు భావిస్తారని, అందులో నిజం లేదని తెలుసుకోవాలి. ఆరోగ్యవంతులు గరిష్టంగా 25-30 నిమిషాలు నిద్రించవచ్చు. చిన్న పిల్లలు, వృద్ధులు ఓ గంట సమయం వరకు కనుకు తీయవచ్చు. మధ్యాహ్నం నిద్ర(Sleeping)తో ఎంతో మానసిక ప్రశాంతత లభించి తాను ఎన్నో విజయాలు సాధించానని సాకర్ స్టార్ రొనాల్డో ఎన్నో సందర్భాలలో ప్రస్తావించడం తెలిసిందే. 

Also Read: స్మోకింగ్ చేస్తున్నారా.. ఇకనుంచి వారికి నిషేధం, కొత్త రూల్స్ ఇవే!

మధ్యాహ్నం నిద్ర(NAP) వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
-  మధ్యాహ్నం చిన్న కునుకు తీస్తే జీర్ణక్రియ మెరుగవుతుంది

-  ఒత్తిడిని మరిచి నిద్రిస్తారు కనుక హైబీపీని సైతం నియంత్రిస్తుంది.

-  డయాబెటిస్(Diabetes), పీసీఓడీ, థైరాయిడ్ సమస్యలకు చిన్న పరిష్కారం

-  హార్మన్ల సమతౌల్యత పెరుగుతుంది. హోర్మోన్లు చక్కగా పనిచేస్తాయి.

-  స్థూలకాయ సమస్య నుంచి బయటపడవచ్చు

-  అనారోగ్యం నుంచి కోలుకునేందుకు ఉపకరిస్తుంది. 

-  చెడు కొవ్వును కరుగుతుంది

Also Read: Health Tips: ఆరోగ్యంగా జీవించాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News