కౌమారంలో వ్యాయామం చేయటం లేదా?

బాల్యం తరువాత వచ్చే కౌమార దశలో పిల్లలు వ్యాయామం చేస్తే వృత్తిరీత్యా ఎటువంటి ఒత్తిళ్లకు లోనుకారట. అలాటివాళ్లకు మిడిల్ ఏజ్ లో గుండె జబ్బులు, ముసలితనంలో అల్జీమర్స్ రాకుండా ఉంటాయట.

Last Updated : Dec 3, 2017, 01:22 PM IST
కౌమారంలో వ్యాయామం చేయటం లేదా?

చిన్నతనంలో పిల్లలు ఆట, పాటల్లో మునిగి తేలడటం సహజం. అలా కాకుండా ఒకేచోట గమ్మున కూర్చుంటే  మాత్రం ఆలోచించాల్సిన విషయమే సుమీ..! అని అంటున్నారు ఈస్ట్రన్ విశ్వవిద్యాలయ నిపుణులు. ఎందుకంటారా? చిన్నతనంలో శారీరక వ్యాయామం చేయడం వల్ల పిల్లలు పెరిగి పెద్దయ్యాక శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారట. ముఖ్యంగా బాల్యం తరువాత వచ్చే కౌమార దశలో పిల్లలు వ్యాయామం చేస్తే వృత్తిరీత్యా ఎటువంటి ఒత్తిళ్లకు లోనుకారట. అలాటివాళ్లకు మిడిల్ ఏజ్ లో గుండె జబ్బులు, ముసలితనంలో అల్జీమర్స్ రాకుండా ఉంటాయట. అంతేనా..  వ్యాయామం నేరుగా మెదడు పెరుగుదలను ప్రేరేపిస్తుంది కూడా. కనుక వ్యాయామాన్ని పొట్ట తగ్గటానికి, లావు తగ్గటానికి అని కాకుండా మన ఆరోగ్యం కోసం అనుకొని చేయాలట. వాళ్లను వ్యాయామానికి పంపే బాధ్యతను ఇంట్లో తల్లితండ్రులు తీసుకుంటే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. 

Trending News