Benefits of Almonds: బాదం నానబెట్టి ఎందుకు తినాలి..? అందుకు కారణాలివే!

Health Tips |    సాధారణంగా కొందరు బాదం నానబెట్టి తింటారు, మరికొందరు సాధారణంగా తినేస్తారు. అయితే బాదం నానబెట్టి తింటేనే అధిక ప్రయోజనం  (Benefits of Almonds) కలుగుతుందని మీకు తెలుసా. 

Last Updated : Oct 4, 2020, 03:34 PM IST
Benefits of Almonds: బాదం నానబెట్టి ఎందుకు తినాలి..? అందుకు కారణాలివే!

ప్రస్తుతం కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి నేపథ్యంలో అధికంగా వినిపిస్తున్న మాట రోగనిరోధక శక్తి. దైనందిన జీవితంలో మనకు రోగ నిరోధక శక్తి పాత్ర కీలకమని అందుకు తరచుగా డ్రై ఫ్రూట్స్ తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ముఖ్యంగా బాదం, కాజు, పిస్తా, ఎండు ద్రాక్ష లాంటివి తినాలని శరీరానికి విరివిగా పోషకాలు లభిస్తాయని చెబుతారు. అయితే ఇందుకు బాదం (Health Benefits Of Almonds) చాలా ప్రత్యేకం. 

Health Tips: ఎక్సర్‌సైజ్ ఎక్కువగా చేస్తున్నారా.. ఈ సమస్యలు తెలుసుకోండి

బాదం పప్పు రేటు ఎక్కువ, అదే విధంగా దీని ప్రయోజనాలు (Benefits of Almonds) ఎక్కువే. సాధారణంగా కొందరు బాదం నానబెట్టి తింటారు, మరికొందరు సాధారణంగా తినేస్తారు. అయితే బాదం నానబెట్టి తింటేనే అధిక ప్రయోజనం కలుగుతుందని మీకు తెలుసా. అందుకే రాత్రి నానబెట్టి ఉదయం బాదం తినేవారికి అధిక పోషకాలు అందుతాయి. ఇలా తినడం వల్ల బరువు తగ్గడం, రక్తపోటు అదుపులో ఉంచుతుంది. కొన్ని రకాల క్యాన్సర్ ముప్పు నుంచి మనల్ని దూరం చేస్తుంది.

CoronaVirus: కళ్లద్దాలు ధరిస్తే ఎంత వరకు ప్రయోజనం ఉందంటే! 

 

బాదం తొక్కలో టానిన్లు ఉంటాయి. నానబెట్టకుండా తింటే అవ మన శరీరంలోకి పోషకాలను సరిగా అందనీయవు. ఓ నాలుగైదు బాదం పప్పులను నానబెట్టి రోజూ తింటే ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. ఒకవేళ మీకు పొట్టు ఇష్టం లేదనుకుంటే.. నానబెట్టిన బాదంను ఉదయం పొట్టు తీసి తినవచ్చు. అప్పుడు పోషకాలు మీ శరీరానికి విరివిగా (Benefits of Almonds) అందుతాయి. పొట్టు తీసన బాదం మూడు, నాలుగు రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. నార్మల్‌గా తింటే బాదం రుచిగా ఉంటుంది కానీ పోషకాలు అంతగా అందవు. 

నానబెట్టిన బాదం తినడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు (Health Benefits Of Eating Almonds)

  • నానబెట్టిన బాదం వారంలో ఓ నాలుగు రోజులు తింటే గుండె సంబంధిత సమస్యల్ని దూరం చేస్తుంది.
  • బాదం నానబెట్టి తింటే మీకు పీచు పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. 
  • బాదంలో ఐరన్(ఇనుము), కాల్షియం, మెగ్నీషియం, జింకు, ఫాస్పరస్, సోడియం ఖనిజ లవణాలు విరివిగా ఉన్నాయి (Badam Benefits: ఉదయాన్నే బాదం తింటున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా!)
  • బాదం పప్పులో విటమిన్-ఈ, ఒమెగా3 అమైనో ఆమ్లాలు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. 
  • మలబద్దకం సమస్యను బాదం దూరం చేస్తుంది.

Weight Loss Tips: చూయింగ్ గమ్ నమలడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News