/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Coconut Water Health Benefits: ప్రస్తుతం చాలా మంది మార్నింగ్ వాక్‌కి వెళ్లేటప్పుడు కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటారు. కొంతమంది ఫిట్‌నెస్ పెంచుకోవడానికి ఆహారంలో కొబ్బరి నీటీని తాగుతున్నారు. అయితే తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా ఉదయం పూట ఈ కొబ్బరి నీరు తాగడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ నీటిలో కేలరీలు, చక్కెర, పిండి పదార్థాలు చాలా తక్కువ లభిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ నీటిని ఉదయం తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

కొబ్బరి నీళ్లను ప్రతి రోజూ ఉదయం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

బరువు కోల్పోతారు:
బరువు తగ్గడానికి కొబ్బరి నీరు ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి శరీరంలో బయోయాక్టివ్ ఎంజైమ్‌లు జీవక్రియను పెంచి శరీర బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్‌ కూడా తగ్గుతుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది:
కొబ్బరి నీళ్లలో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ నీటిని ప్రతి రోజూ తాగడం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు అధిక రక్త పోటు సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలీక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‌:
కొబ్బరి నీరు ప్రతి రోజూ తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా తగ్గిస్తుంది. కొబ్బరి నీరు శరీరాన్ని డిటాక్స్ చేసే చాలా రకాల గుణాలు ఉంటాయి. కాబట్టి ఈ నీటిని ప్రతి రోజూ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

చర్మ సమస్యలకు చెక్‌:
కొబ్బరి నీళ్లలో ఉండే గుణాలు చర్మానికి చాలా మేలు చేస్తాయి. మొటిమల సమస్యను తొలగించడానికి కొబ్బరి నీళ్లు ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి మెరిసేలా చేస్తుంది. అంతేకాకుండా చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.  

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read:  Jamuna Death : జమున మరణం.. చిరు, బాలయ్య, పవన్ సంతాపం.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్

Also Read: KGF Vasishta Wedding : నాని హీరోయిన్‌ను పెళ్లాడిన కేజీయఫ్ నటుడు వశిష్ట.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Section: 
English Title: 
Health Benefits: Drinking Coconut Water On An Empty Stomach Reduces Weight Loss And Blood Pressure Problems
News Source: 
Home Title: 

Health Benefits: చెడు కొలెస్ట్రాల్‌, శరీర బరువు తగ్గడానికి ఇలా కొబ్బరి నీరు తాగండి చాలు..

Health Benefits: చెడు కొలెస్ట్రాల్‌, శరీర బరువు తగ్గడానికి ఇలా కొబ్బరి నీరు తాగండి చాలు..
Caption: 
source: zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
చెడు కొలెస్ట్రాల్‌, శరీర బరువు తగ్గడానికి ఇలా కొబ్బరి నీరు తాగండి చాలు..
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Saturday, January 28, 2023 - 14:03
Request Count: 
57
Is Breaking News: 
No