Hair Fall Prevention Diet: ఈ డైట్ ఫాలో అయితే జుట్టు రాలే సమస్య వెంటనే తగ్గుతుంది!

Hair Fall Prevention Diet: జుట్టు రాలడమనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య. చిన్నా, పెద్ద వయసు తేడా లేకుండా నలుగురులో ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. కానీ, జట్టు రాలడాన్ని కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2022, 03:26 PM IST
    • యువతలోనూ పెరిగిన పోయిన హెయిర్ ఫాల్ సమస్య
    • వాతావరణం మార్పులు, ఒత్తిడి వల్ల జట్టు రాలే అవకాశం
    • స్పెషల్ డైట్ ఫాలో అవ్వడం వల్ల ఆ సమస్యకు నియంత్రించవచ్చు
Hair Fall Prevention Diet: ఈ డైట్ ఫాలో అయితే జుట్టు రాలే సమస్య వెంటనే తగ్గుతుంది!

Hair Fall Prevention Diet: వయసు పెరిగే కొద్దీ జుట్టు రాలడం సహజంగా జరుగుతుంది. ఆహారపు అలవాట్లు, దుమ్ము ధూళి, వాతావరణంలో మార్పులు, తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల జట్టు రాలే అవకాశం ఉంది. కానీ, ప్రస్తుత యువతలో చాలా మందికి జట్టు రాలే సమస్య వేధిస్తోంది. జుట్టు రాలిపోయే సమస్యను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. జుట్టు రాలే సమస్యకు షాంపూ లేదా ఆయిల్ రీప్లేస్మెంట్ పరిష్కారం కాదు. దీని కోసం మీరు జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి ఆహారాన్ని అనుసరించాలి.

మీరు ఎక్కువగా జుట్టు రాలడాన్ని ఎదుర్కొంటుంటే, మీ జీవనశైలిలో వెంటనే మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆహార నిపుణుడి సలహాతో తగిన ఆహారాన్ని తీసుకోవాలి. ఇది మీ జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. అయితే జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి మంచి ఆహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

1) పప్పుదినుసులు

జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో పప్పుదినుసులు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇది జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. దీని కోసం మీరు బఠానీలు, బీన్స్, ఇతర చిక్కుడు విత్తనాలను తినవచ్చు.

2. విత్తనాలు (సీడ్స్)

విత్తనాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవిసె గింజలు, చియా గింజలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఈ గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి.

3. జామకాయ

ఉసిరికాయను రోజూ తీసుకోవడం ద్వారా జుట్టు సంరక్షణను పొందవచ్చు. జామకాయలో పెద్ద మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అదనంగా, ఇది విటమిన్ సి యొక్క గొప్ప మూలం. ఉసిరి, జామకాయలోని పోషకాలతో జుట్టు రాలడాన్ని నియంత్రించవచ్చు. 

4. డ్రై ఫ్రూట్స్ 

డ్రై ఫ్రూట్స్‌లో జుట్టు రాలడాన్ని నిరోధించే అన్ని పోషకాలు ఉంటాయి. మీకు జుట్టు రాలిపోయే సమస్య ఉంటే, వెంటనే మీ డైట్‌లో డ్రై ఫ్రూట్స్‌ని చేర్చుకోండి. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది మీ జుట్టుకు చాలా మేలు చేస్తుంది.

5. పాలకూర

పచ్చి ఆకు కూరలలో ఆరోగ్యకరమైన ఆహారాల జాబితాలో పాలకూర మొదటిగా ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే ఇందులో ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. 

Also Read: Hair Fall Reduce Tips: విపరీతంగా జట్టు రాలుతుందా? అయితే ఈ యోగాసనాలు ట్రై చేయండి!

Also Read: Carrot Side Effects: క్యారెట్ ఆరోగ్యానికి మంచిదే.. కానీ, వీళ్లు క్యారెట్ కు దూరంగా ఉండాలి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News