Gongura Pachadi Benefits: భారతీయులు ఎక్కువగా వినియోగించే ఆకుకూరల్లో గోంగూర ఒకటి. ఈ ఆకుకూరను వివిధ రాష్ట్రాల వారు వివిధ పద్ధతుల్లో ఆహారంలో వినియోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు నాన్ వెజ్ లో కూడా ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఇది నోటికి పుల్లటి రుచిని అందించడమే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనితో తయారు చేసిన ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఐరన్ లోపం కారణంగా రక్తహీనత సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా గోంగూరతో తయారుచేసిన పచ్చడిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు తీవ్ర పొట్ట సమస్యల నుంచి కూడా సులభంగా ఉపవాసం కలిగిస్తాయి. తరచుగా కడుపు ఉబ్బరం, శరీర బలహీనత సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పూట అల్పాహారంలో గోంగూరతో తయారుచేసిన పచ్చడిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు ఈ సమస్యల నుంచే కాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తాయి.
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
ప్రస్తుతం చాలామందిలో రక్తపోటు సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగానే గుండె, ఊపిరితిత్తులు సమస్యల బారిన కూడా పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి క్రమం తప్పకుండా గోంగూరతో తయారుచేసిన ఆహారాలను తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇలా తినడం వల్ల సులభంగా రక్తపోటు అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా వానాకాలంలో గోంగూరతో తయారుచేసిన చట్నీని ప్రతిరోజు తినడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా కంటి చూపు సమస్యలకు కూడా ప్రభావవంతంగా సహాయపడుతుంది. అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే తప్పకుండా గోంగూరతో తయారుచేసిన చట్నీలు ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook