Belly Fat: అంగుళం అల్లం ముక్కతో వేలాడే పొట్టకు చెక్‌ పెట్టొచ్చు! ఇలా ప్రతి రోజు తీసుకోండి చాలు..

Ginger Juice For Belly Fat: అల్లం నీటిని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు వేలాడుతున్న పొట్టను కూడా సులభంగా తగ్గిస్తాయి. కాబట్టి మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 27, 2023, 03:12 PM IST
Belly Fat: అంగుళం అల్లం ముక్కతో వేలాడే పొట్టకు చెక్‌ పెట్టొచ్చు! ఇలా ప్రతి రోజు తీసుకోండి చాలు..

 

Ginger Juice For Belly Fat: బరువు తగ్గడానికి, బెల్లీ ఫ్యాట్‌ను నియంత్రించుకోవడానికి చాలా మంది విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి కొంతమంది ఆహారాలను డైట్‌ పద్ధతిలో తీసుకుంటున్నారు. ఇలా తిసుకునేవారిలో బరువు తగ్గినప్పటికీ..కొన్ని రోజుల తర్వాత మళ్లీ పెరుగుతున్నారు. అయితే వేలాడుతున్న పొట్ట కొవ్వును తగ్గించుకోవాలనుకునేవారు డైట్‌లో ఆయుర్వేద నిపుణులు సూచించిన రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. 

అల్లం బరువు, పొట్ట తగ్గింస్తుందా?:
వేలాడుతున్న పొట్టను తగ్గించుకోవాలనుకునేవారు అల్లం రసాన్ని ప్రతి రోజు తాగాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు కడుపు ఉబ్బరాన్ని తగ్గించడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. ప్రతి రోజు ఈ రసాన్ని తాగడం వల్ల ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. అయితే ఈ రసాన్ని కొంతమంది తాగడం వల్ల తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్

కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి ఈ రసాన్ని ఎలా తీసుకోవాలి:
పొట్ట చుట్టూ సమస్యలతో బాధపడేవారు ప్రతి అల్లం టీని తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. అయితే టీలు తాగని వారు..ప్రతి రోజు ఒకటిన్నర కప్పు నీటిని వేడి చేసి అందులో అల్లం ముక్కలను కట్‌ చేసి వేసుకోవాలి. ఇలా ఆ నీటిని 5 నిమిషాల పాటు మరిగించి ఫిల్టర్‌ చేసి గ్లాస్‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే టీస్పూన్ తేనె వేసి బాగా మిక్స్‌ చేసుకుని తాగాలి. ఇలా తాగడం వల్ల సులభంగా బరువు తగ్గడమే కాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్‌ కూడా సులభంగా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

గ్రీన్ టీలో అల్లం కలుపుకుని తాగండి:
గ్రీన్‌ తాగడం వల్ల శరీరానికి ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే..అయితే గ్రీన్ టీలో అల్లం నీటిని కలుపుకుని తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో దాగి ఉన్న గుణాలు జీర్ణక్రియను మెరుగుపరిచి..కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా బరువు తగ్గడానికి డైట్‌ పద్దతిలో తీసుకునే ఆహారాల్లో కూడా అల్లం ముక్కలను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 

ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News