Ginger Juice Benefits: అల్లం రసంలో మంచి డీటాక్సిఫైయింగ్ గుణాలు ఉంటాయి. మన శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటికి పంపించేసాయి. అల్లం మన వంట గదిలో కచ్చితంగా ఉంటుంది ఇది వివిధ కూరల్లో వేసి వండుకుంటారు. అయితే అల్లంతో తయారు చేసిన టీ మాత్రమే కాదు నేరుగా అల్లం జ్యూస్ ని తాగడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం లో విటమిన్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అల్లం రసం తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. తలనొప్పి, జలుబు, జ్వరానికి కూడా అల్లం మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది అయితే పరగడుపున తీసుకోవడం వల్ల అల్లం రసంతో ఎన్ని ఉపయోగాలు ఉంటాయో తెలుసుకుందాం.
జీర్ణ ఆరోగ్యం..
అల్లం జీర్ణ ఆరోగ్యానికి ఒక వరం వంటిది ఇందులో జీర్ణ సమస్యలు తగ్గించడానికి గుణాలు ఉంటాయి అజీర్తి కడుపు, ఉబ్బరం సమస్యలతో బాధపడుతున్న వారికి అల్లం ఎఫెక్టివ్ రెమిడీ. పరగడుపున అల్లం రసం తాగడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా అల్లం కాపాడుతుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు..
అల్లంలో ఆండ్రియా ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో జాయింట్ పెయిన్ సమస్యలు రావు ఆర్థరైటీస్ సమస్యలకు అల్లం ఎఫెక్టివ్ రెమిడీ. అంతే కాదు పరగడుపున అల్లం రసం తాగడం వల్ల మన కడుపులో ఉండే చెడు బ్యాక్టీరియా బయటకు వెళ్ళిపోతుంది.
ఇమ్యూనిటీ బూస్టర్..
అల్లం రసం పరగడుపున తీసుకోవడం వల్ల శరీరానికి ఇమ్యూనిటీని బూస్టింగ్ ఇస్తుంది. సీజనల్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. పరగడుపున అల్లం రసం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరగకుండా ఉంటాయి. అంతేకాదు రోజంతటికి కావలసిన శక్తిని అల్లం అందిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్..
అల్లం రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి సెల్యులర్ హెల్త్ కు పయోగపడతాయి ప్రాణాంతక వ్యాధులకు రాకుండా కాపాడుతాయి.
ఇదీ చదవండి: అంజీర్ పండు నానబెట్టిన నీళ్లతో 5 మిరాకిల్ బెనిఫిట్స్..
మార్నింగ్ సిక్నెస్..
అల్లం లో యాంటీ నాసియా గుణాలు పుష్కలంగా ఉంటాయి. మార్నింగ్ వీక్నెస్ సమస్య ఉన్నవారికి ఇది ఎఫెక్టీవ్ రెమిడీ. ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో అల్లం రసం తీసుకోవడం వల్ల ఇది కడుపు సంబంధిత వ్యాధులు మార్నింగ్ సిక్సెస్ కి కూడా చెక్ పెట్టవచ్చు..
బరువు తగ్గుతారు..
అల్లం రసం తీసుకోవడం వల్ల బాడీ మెటపాలిజం పెరుగుతుంది. బరువు పెరగకుండా ఉంటారు ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు క్యాలరీల అల్లంలో క్యాలరీలు తగ్గించే గుణం ఉంటుంది. బొడ్డు చుట్టూ కొవ్వు తగ్గించుకునే వాళ్ళకి అల్లం ఎఫెక్టీవ్‌గా త్వరగా బరువు తగ్గిస్తుంది. అల్లం పరగడుపున తీసుకోవడం వల్ల ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల ప్రభావంతంగా పనిచేస్తుంది ఖాళీ కడుపున అల్లం టీ ని తీసుకోవడం వల్ల ఎక్కువ ఔషధ గుణాలు పొందుతారు.
ఇదీ చదవండి: అతిగా చక్కెర తింటే అనర్థాలే.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
అలానే వివిధ రకాల సూప్స్ లో కూడా వేసుకొని తినవచ్చు స్లైసెస్ గా కట్ చేసుకొని లేకపోతే బ్లెండ్ చేసి ఏదైనా స్మూథీల్లో అల్లం ఆడ్ చేసుకుని తీసుకుంటే ఎఫెక్టివ్ గుణాలు లభిస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Ginger Juice Benefits: పరగడుపున అల్లం రసం తాగితే ఏమవుతుందో తెలుసా?