/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Ginger Side Effects: ఆయుర్వేదంలోనే కాదు..ఇతర వైద్య విధానాల్లో కూడా అల్లంకు మహత్యమెక్కువ. అదే సమయంలో అల్లం అతిగా తింటే అనారోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దాం..

దేశంలో ప్రతి వంటింట్లో తప్పకుండా ఉండేది అల్లం. అల్లంతో ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలుంటాయి. గొంతు, ఉదరం, జీర్ణ వ్యవస్థ, ఊపిరితిత్తులకు చెందిన చాలా రుగ్మతలకు అల్లం పరిష్కారం చెబుతుందనేది అనాదిగా పెద్దలు, ఆయుర్వేద వైద్యులు చెప్పే మాట.  కేవలం ఆయుర్వేదంలోనే కాదు..అన్ని వైద్య విధానాల్లో కూడా ఇదే  ప్రస్తావన ఉంది. అయితే అల్లంతో దుష్పరిణామాలు కూడా ఉన్నాయంటే నమ్మగలమా..నిజమే మరి. అతిగా తింటే ఏదైనా అనర్దమే కదా. మరి అటువంటప్పుడు అల్లం రోజుకు ఎంత పరిమాణంలో తీసుకోవాలనేది ఇప్పుడు పరిశీలిద్దాం..

రోజుకు అల్లం ఎంత పరిమాణంలో తీసుకోవాలి

రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ అల్లం తీసుకోకూడదని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె దడ అధికమౌతుంది. అల్లం ఎక్కువగా తింటే..కంటి చూపు దెబ్బతింటుంది. నిద్రలేమి సమస్య, లో బ్రడ్ ప్రెషర్ కలుగుతాయి. అల్లం పరిమితి దాటి తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలే కాకుండా విరేచనాలు, గర్భస్రావం కూడా తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

అల్లంతో కలిగే దుష్పరిణామాలు

ఇక అల్లం అతిగా తీసుకుంటే కడుపు నొప్పి సంభవిస్తుంది. సహజంగా అల్లం పరగడుపున తీసుకుంటుంటాము. పరగడుపున ఎక్కువ అల్లం తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. అల్లం క్రమం తప్పకుండా ఎక్కువగా తీసుకుంటే అది కంటి సంబంధిత సమస్యలకు కారణం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్కిన్, ఐ ఎలర్జీలు ఎదురౌతాయంటున్నారు. కళ్లు ఎర్రబడటం లేదా దురద, పెదవుల్లో వాపు, గొంతులో అసౌకర్యం ఇవన్నీ అల్లం అతిగా తింటే కలిగే దుష్పరిణామాలే. 

మధుమేహ వ్యాధిగ్రస్థులు అల్లం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అల్లంం రక్తపీడనానికి కారణమై..అలసట కల్గిస్తుంది. అందుకే డయాబెటిస్ రోగులు వైద్యుని సలహా మేరకే అల్లం తీసుకుంటే మంచిది. ఇక గర్భిణీ స్త్రీలు కూడా అల్లం వినియోగానికి దూరంగా ఉంటే మంచిది. అల్లం ఎక్కువగా తింటే గర్భస్రావం ప్రమాదముంది. గుండెల్లో మంట, గ్యాస్ తన్నడం వంటి సమస్యలు ఎదురౌతాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే అల్లం తక్కువ పరిమాణంలో తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో..పరిమితి దాటితే మాత్రం అన్ని రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.

Also read: Cholesterol Diet: కొలెస్ట్రాల్ నుంచి ఉపశమనం, గుండె ఆరోగ్యం కావాలంటే..ఈ పండ్లు తప్పకుండా తినాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok

Section: 
English Title: 
Ginger Health Precautions and side effects, know the five side effects of ginger if you take excess
News Source: 
Home Title: 

Ginger Side Effects: అల్లం ఆరోగ్యానికి మంచిదా కాదా, అతిగా తింటే ఆ ప్రమాదముందా

Ginger Side Effects: అల్లం ఆరోగ్యానికి మంచిదా కాదా, అతిగా తింటే ఆ ప్రమాదముందా
Caption: 
Gnger side effects ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Ginger Side Effects: అల్లం ఆరోగ్యానికి మంచిదా కాదా, అతిగా తింటే ఆ ప్రమాదముందా
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Saturday, September 17, 2022 - 21:37
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
58
Is Breaking News: 
No