Garlic For Weight Loss: వెల్లుల్లి కేవలం ఆహారాన్ని రుచికరంగా మార్చడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది లిలియేసి (Liliaceae) కుటుంబానికి చెందిన ఒక రకమైన బల్బస్ (bulbous) మొక్క. దీనిని ఆహారంలో రుచి కోసం మాత్రమే కాకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సగా కూడా ఉపయోగిస్తారు. ముఖ్యంగా బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. వెల్లుల్లి తినడం వల్ల బరువు ఎలా తగ్గుతారు అనేది మనం తెలుసుకుందాం.
వెల్లుల్లిలో మెటాబాలిజం రేటు ఎక్కువగా ఉంటుంది. దీంతో శరీరంలో క్యాలరీలు వేగంగా బర్న్ అవుతాయి. అంతేకాకుండా వెల్లుల్లి కొవ్వు కణాలను పెరుగుదలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ శరీరం నుంచి తొలగించడంలో వెల్లుల్లి సహాయపడుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కూడా వెల్లుల్లి మేలు చేస్తుంది. దీని వల్ల మనం తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. తరచూ దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడే వారు కూడా వెల్లుల్లి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం. వెల్లుల్లిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కొన్ని రకాల బ్యాక్టీరియాను నాశనం చేయడంలో సహాయపడతాయి. వెల్లుల్లి శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది.
వెల్లుల్లిని ఎలా తీసుకోవాలి:
ప్రతిరోజ ఉదయం పరగడుపున ఒక వెల్లుల్లి పచ్చిగా తినడం వల్ల ఆరోగ్యానికి లాభాలు కలుగుతాయి. వెల్లుల్లి పచ్చిగా తినలేని వారు తేనెతో కలుపుకొని కూడా తినవచ్చు. అలాగే వెల్లుల్లి పేస్ట్ ను ఆహారంలో కూడా కలుపుకోవచ్చు. వెల్లుల్లి పొడిని చేసుకొని అన్నంలో కలుపుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే వెల్లుల్లి బరువు తగ్గడానికి సహాయపడే ఆహారం అయినప్పటికీ బరువు తగ్గాలనుకునే వారు జీవన శైలిలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలిసి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం వాకింగ్ లేకపోతే యోగ వంటి పనులు చేయడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు తగ్గుతుంది.
ముగింపు:
వెల్లుల్లి అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక అద్భుతమైన ఆహార పదార్థం. అయితే, ఏదైనా ఆహార పదార్థాన్ని తీసుకోవడానికి ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
Also read: Green Tea Tips: గ్రీన్ టీ తాగే అలవాటుందా అయితే ఈ 7 తప్పులు చేయవద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.