Get Rid Of Cold Cough Fever Flu In Less Than 48 Hours: శీతాకాలం కారణంగా వాతావరణంలో తేమ తీవ్రంగా పెరిగిపోతుంది. అయితే దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు జలుబు, దగ్గు, జ్వరం వంటి చిన్న చిన్న సాధారణ వ్యాధులు వస్తూ ఉంటాయి. అయితే ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది లేకపోతే చిన్న చిన్న వ్యాధులే దీర్ఘకాలిక వ్యాధులుగా మారే అవకాశాలు ఉన్నాయి. మరికొందరైతే జలుబు దగ్గు నుంచి ఉపశమనం పొందిన తర్వాత కూడా వివిధ రకాల తప్పులు చేస్తున్నారు. దీని కారణంగా ఆరోగ్యం మరింత క్షీణిస్తూ వస్తుంది. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు తరచుగా చేసే తప్పులను కూడా మానుకోవాల్సి ఉంటుంది.
జలుబు, జ్వరం సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఇలా చేయకపోవడం చాలా మంచిది..!
నిద్ర లేకపోవడం:
జ్వరం జలుబు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది అంతేకాకుండా శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాటం వల్ల ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. కాబట్టి తప్పకుండా జ్వరంతో బాధపడుతున్న వారు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు పడుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరానికి తగినంత నిద్ర ఉంటేనే శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతుంది.
హెల్తీ ఫుడ్స్:
రోగ నిరోధక శక్తి పెరగడానికి నిద్రపోవడం ఎంత మంచిదో హెల్తీ ఫుడ్స్ తినడం కూడా అంతే మంచిదని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు అయితే తీవ్ర జ్వరం జలుబు సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా పండ్లు ఆకుకూరలు గల ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది.
పానీయాలను తగ్గించండి :
చాలామంది జ్వరం దగ్గుతో బాధపడుతున్నప్పటికీ పానీయాలను విచ్చలవిడిగా తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు జ్వరం మరింత తీవ్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వానియాలు తాగాలనిపిస్తే వేడి పాలు, ఆయుర్వేద మూలికలతో చేసిన హెర్బల్ టీలను తాగొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Raviteja - BVS Ravi: డైరెక్టర్ ను చితక్కొట్టిన రవితేజ.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Fever Cold And Cough: దగ్గు, జలుబు, జ్వరం, ఇతర సీజనల్ వ్యాధులకు 48 గంటల్లో చెక్ పెచ్చొచ్చు..