Fenugreek Water Secrets: మెంతులను ఔషధ మూలికలుగా భావిస్తారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి ఔషధంగా సహాయపడతాయి. ముఖ్యంగా ఈ గింజల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది కణాల నిర్మాణాకి ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్‌తో పాటు విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచేందుకు, కణాలను రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు మెంతి గింజల్లో నియాసిన్, పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. అలాగే రక్తహీనతను పోగొట్టేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇవే కాకుండా బోలెడు లాభాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మెంతుల నీటిని తాగడం వల్ల వీటికంటే ఎక్కువ లాభాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
షుగర్ లెవెల్స్ నియంత్రణ:
మెంతి విత్తనాల్లో ఉండే ఫైబర్, ఇతర పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి ఈ మెంతి గింజల నీరు ఔషధం కంటే ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీని కారణంగా మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది.
జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం:
రోజు ఉదయం మెంతి నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీంతో పాటు మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది:
మెంతి విత్తనాల్లో ఉండే లెక్టిన్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. దీంతో పాటు ఎలాంటి మెండి కొవ్వునైనా సులభంగా తగ్గిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా గుండె సమస్యలకు చెక్ పెట్టేందేకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
బరువు తగ్గడానికి సహాయం:
మెంతి నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో పాటు మెటబాలిజమ్‌ను పెంచేందుకు కూడా ఎంతో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అలాగే శరీర బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఇది ఆకలిని కూడా ఎంతగానో నియంత్రిస్తుంది.
చర్మ ఆరోగ్యం:
మెంతి నీరు తాగడం వల్ల చర్మం కూడా మెరుగుపడుతుంది. దీంతో పాటు ముఖంపై మచ్చల నుంచి విముక్తి కలిగిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. దీంతో పాటు శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.