Fenugreek Leaves: కూరగాయల కంటే ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే ఇవి తేలిగ్గా జీర్ణం అవడమే కాకుండా పోషకాలు సమృద్ధిగా అందిస్తాయి. నిత్య జీవితంలో శరీరం ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యలను ఆకు కూరలతో చెక్ చెప్పవచ్చు. అందుకే వారంలో కనీసం 3 సార్లు ఆకు కూరలు తప్పకుండా తినాలి. ఈ ఆకు కూరల్లో ముఖ్యమైంది మెంతికూర.
మనకు మార్కెట్‌లో లభించే తోటకూర, పాలకూర, చుక్క కూర లాంటిదే మెంతి కూర కూడా. మెంతులు ఆరోగ్యానికి ఎంత మంచివో మెంతి కూర కూడా అంతే ప్రయోజనకరమైంది. మెంతి కూరను డైట్‌లో చేర్చి వారంలో కనీసం రెండు సార్లు లేదా ఒకసారి తింటే శరీరంలో అద్భుతమైన మార్పులు గమనించవచ్చు. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి, ఫైబర్ కారణంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ సులభంగా కరుగుతుంది. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా వారంలో రెండు సార్లు మెంతి కూర తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి, కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలతో బాధపడేవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
ఇందులో ఫైబర్ పెద్దమొత్తంలో ఉండటం వల్ల కడుపు నిండినట్టు ఉంటుంది. దాంతో బరువు తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మధుమేహం వ్యాధిగ్రస్థులకు మెంతి కూర దివ్యౌషధంగా భావిస్తారు. ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో మెంతి ఆకులకు చాలా ప్రాధాన్యత ఉంది. రక్తంలో చక్కెర స్థాయిని మెంతి ఆకులు అద్భుతంగా తగ్గిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు చాలా బాగా పనిచేస్తుంది.
మెంతి కూరలోని పోషకాలు శరీరంలోని విష పదార్ధాలను బయటకు పంపించడంలో దోహదం చేస్తాయిత దాంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మంపై ముడతల్ని దూరం చేస్తాయి. చర్మాన్ని యౌవనంగా ఉంచుతాయి. స్వభావరీత్యా మెంతి కూర వేడి చేస్తుంది. అందుకే వారంలో రెండు సార్లు చాలు. శరీరంలో హార్మోన్ బ్యాలెన్స్ చేయడంలో మెంతికూర అద్భుతంహగా పనిచేస్తుంది. పీరియడ్స్ సమస్యల్లో కూడా మెంతికూర ఉపశమనం కల్గిస్తుంది.
Also read: 8th Pay Commission: ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్, 8వ వేతన సంఘంతో ఉద్యోగుల జీతభత్యాలు ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.