కొవ్వు కరిగించే మందుతో కరోనా వైరస్‌కు చెక్, తాజా అధ్యయనంలో ఆసక్తి కల్గించే విషయాలు

Covid19 Treatment: కోవిడ్ మహమ్మారి చికిత్సకు ఇప్పటికీ ప్రయోగాలు జరుగుతున్నాయి. వివిధ రకాల మందుల్ని ప్రయోగిస్తూ పరిశోధనలు చేస్తున్నారు. తాజా అధ్యయనంలో మరో మందు గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 7, 2021, 05:58 PM IST
కొవ్వు కరిగించే మందుతో కరోనా వైరస్‌కు చెక్, తాజా అధ్యయనంలో ఆసక్తి కల్గించే విషయాలు

Covid19 Treatment: కోవిడ్ మహమ్మారి చికిత్సకు ఇప్పటికీ ప్రయోగాలు జరుగుతున్నాయి. వివిధ రకాల మందుల్ని ప్రయోగిస్తూ పరిశోధనలు చేస్తున్నారు. తాజా అధ్యయనంలో మరో మందు గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

రక్తంలో అసాధారణ స్థాయిలో ఉండే కొవ్వు పదార్ధాల్ని కరిగించేందుకు లేదా తొలగించేందుకు ప్రస్తుతం మందు అందుబాటులో ఉంది. అదే మందు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌(Corona Virus)ను అంతం చేయగలదనే ఆసక్తికరమైన అధ్యయనం వెలుగు చూసింది. కొవ్వు పదార్ధాల్ని కరిగించే మందు..కరోనా వైరస్‌ను 70 శాతం వరకూ కట్టడి చేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది.యూకేలోని బర్మింగ్ హామ్ యూనివర్శిటీ నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కొవ్వు తగ్గించేందుకు వాడే ఫీనోఫైబ్రేట్ (Feno fibrate)మందు కోవిడ్ 19 ఇన్‌ఫెక్షన్‌ను బాగా తగ్గిస్తుందని తెలిసింది. వైరస్ వ్యాప్తిని, కరోనా తీవ్ర ప్రభావాన్ని ఫీనో ఫైబ్రెట్ తగ్గిస్తున్నట్టు పరిశోధకులు తెలిపారు. 

ప్రపంచవ్యాప్తంగా నోటి ద్వారా తీసుకునే ఈ మందుతో దుష్పరిణామాలు తక్కువేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనాపై ఈ మందును వినియోగించేందుకు క్లినికల్ ట్రయల్స్(Clinical trials) జరపాలని..ట్రయల్స్‌లో సత్ఫలితాలు వస్తే అల్పాదాయ దేశాలకు వరంగా మారుతుందని  వైద్య నిపుణులు చెబుతున్నారు. మనిషి కణాల్లోకి కరోనా ప్రవేశాన్ని కల్పించే చర్యను ఈ మందు సమర్ధవంతంగా అడ్డుకుంటున్నట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన ఆధారంగా కరోనాపై ఫీనోఫైబ్రెట్ ప్రభావాన్ని అధ్యయనం చేసే క్లినికల్ ట్రయల్స్ అమెరికా, ఇజ్రాయిల్‌లలో జరుగుతున్నాయి.

Also read: జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ షాట్ వ్యాక్సిన్‌కు ఇండియాలో అనుమతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News