Eating Habits: మారుతున్న జీవన శైలి కారణంగా రకరకాల ఫుడ్‌ను తినేందుకు ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా చాలా మంది పనిలో నిమగ్నమై ఆహారాన్ని తినలేకపోతున్నారు. దీని వల్ల ఒత్తిడి ఇతర ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పోషకాలు అధికంగా ఉన్న ఆహారాన్ని తిసుకోవడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే తిన్న తర్వాత కొన్ని అలవాట్ల వల్ల శరీరానికి తగిన పోషకాలు అందలేకపోతున్నాయని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ అలవాట్లను మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తిన్న తర్వాత ఈ తప్పులు అస్సలు చేయకండి:
తిన్న వెంటనే నిద్రపోవడం:
ప్రస్తుతం చాలా మంది రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకుంటారు. అయితే రాత్రిపూట భోజనం చేసిన 2 గంటల తర్వాత మాత్రమే నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆహారం తిన్న వెంటనే నిద్రపోతే.. ఊబకాయంతో పాటు, ఎసిడిటీ, స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కోవల్సి ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.
భోజనం తర్వాత నికోటిన్ తీసుకోవడం:
చాలా మంది ఆహారం తిన్న తర్వాత టీ, కాఫీ లేదా సిగరెట్ తాగడానికి ఇష్టపడతారు. ఈ అలవాటు మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఇలా చేయడం ద్వారా శరీరంలో నికోటిన్ స్థాయిలు పెరిగి.. సిజిల్ స్థాయిలు ప్రభావితం అవుతాయి.
నీరు తాగడం:
ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. దీని వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. అంతేకాకుండా జీర్ణక్రీయ సమస్యలు కూడా వస్తాయి. కావున తిన్న అరగంట తర్వాత నీరు త్రాగాలని నిపుణులు తెలుపుతున్నారు.
వ్యాయామం చేయడం:
తిన్న తర్వాత వ్యాయామం చేస్తే.. అది జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వాంతులు లేదా కడుపు నొప్పి సమస్యలు కూడా వచ్చే ప్రమాదముందని నిపుణులు పేర్కొన్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Weight Loss Mistakes: బరువు తగ్గే క్రమంలో ఇలా చేయకండి.. ఈ విధంగా చేస్తే సమస్యలు తప్పవు..!
Also Read: Lalu Prasad Yadav's Health Condition: లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమం.. లేటెస్ట్ అప్‌డేట్స్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook