Health tips: సకల అనారోగ్య సమస్యలకు పరిష్కారంగా తీసుకునే పదార్ధాల్లో ఎక్కువ శాతం పర కడుపునే తీసుకుంటూ ఉంటాం. కానీ అదే సమయంలో ఖాళీ కడుపుతో తీసుకోకూడని పదార్ధాలు కూడా ఉన్నాయి. లేకపోతే మొదటికే ప్రమాదమేర్పడుతుంది.
మెరుగైన ఆరోగ్యం కోసం, కొన్ని రకాల శరీర రుగ్మతలకు పరిష్కారంగా తీసుకునే పదార్ధాల్ని పర కడుపునే తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే పర కడుపున తీసుకుంటే ప్రయోజనం ఎక్కువ. అయితే కొన్ని పదార్ధాల్ని ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోకూడదంటున్నారు డైటిషియన్, ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా బరువు తగ్గించుకోవాలనుకునేవారు. బరువు తగ్గాలని కోరుకునేవారు అల్పాహారం అంటే బ్రేక్‌ఫాస్ట్ (Break fast)మానడం అత్యంత ప్రమాదకరమని కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఏది పడితే అది ఉదయం తీసుకోకూడదు.
సాఫ్ట్ డ్రింక్స్‌ను (Soft drinks) మొత్తానికి మానేయడం మంచిది. ఉదయం పూట అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే సాఫ్ట్ డ్రింక్స్‌లో CO2 ఎక్కువగా ఉంటుంది. చక్కెరస్థాయి కూడా అధికమే. అందుకే బరువు తగ్గాలనుకుంటే పూర్తిగా మానేయడం మంచిది. కొంతమంది ఉదయం లేచీ లేవగానే కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఉదయం పూట ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు మాత్రమే తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అల్లంలో వేడినీటిని కలుపుకుని తాగితే జీర్ణ ప్రక్రియ(Digestive system) మెరుగుపడుతుంది. కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది.
అల్పాహారంతో కారంతో తయారైన పదార్ధాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయం పూట కారపు పదార్ధాలు తినడం వల్ల కడుపులో అసౌకర్యం కలుగుతుంది. వీటిలో ఆమ్ల గాఢత ఎక్కువ ఉండటం వల్ల ఇబ్బంది కల్గిస్తుంది. ఇక ముడి కూరగాయల్ని ఉడికించి లేదా పచ్చిగా తినడం కొంతమంది అలవాటు చేసుకుంటారు. ఇది మంచిదే కానీ..పర కడుపున అస్సలు తినకూడదు. ఖాళీ కడుపున తీసుకుంటే నేరుగా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అందుకే కొన్ని పదార్ధాలు ఆరోగ్యానికి మంచివైనా సరే..ఖాళీ కడుపున(Empty stomache)మాత్రం తీసుకోకూడదు.
Also read: Benefits of Drinking Milk: పాలు తాగితే మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సహా పలు సమస్యలు దూరం అవుతాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Health tips: పర కడుపున ఈ పదార్ధాలు అస్సలు తీసుకోకండి
పరకడుపున కొన్ని పదార్ధాలు తీసుకుంటే ప్రమాదమంటున్న ఆరోగ్య నిపుణులు
బరువు తగ్గాలనుకునేవారు ఖాళీ కడుపున సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం మానేయాలి
ఉడికించిన కూరగాయలు లేదా పచ్చి కూరగాయల్ని ఖాళీ కడుపున తీసుకుంటే నష్టమే ఎక్కువ