Digestion Problem: ఎండాకాలంలో ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల పుల్లటి త్రేన్పు(Burping)లు అధికంగా వస్తాయి. ఎందుకంటే వేసవిలో మండుతున్న ఎండల కారణంగా కడుపు నొప్పి, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తరచుగా ఎదురవుతాయి. అంతే కాకుండా కడుపులో విపరీతమైన నొప్పి, తల తిరగడం కూడా మొదలవుతుంది. ఇది పుల్లని త్రేన్పులకు దారి తీస్తుంది. పుల్లని త్రేన్పులు మళ్లీ మళ్లీ రావడం వల్ల శరీరం విశ్రాంతి కోల్పోతుంది. అటువంటి పరిస్థితిలో రోజువారీ సాధారణ పనులు కూడా కష్టంగా మారతాయి. ఈ సమస్య నుంచి ఏ విధంగా విముక్తి పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
పుల్లని త్రేన్పులు వదిలించుకోవడానికి సులభమైన ఇంటి నివారణలు:
కడుపు నొప్పిగా ఉన్నప్పుడు సాధారణంగా ఇంటిలోని చిట్కాలను ఉపయోగించి విముక్తి పొందుతారు. అయితే పుల్లని త్రేన్పులు వదిలించుకోవడానికి ఇంటి చిట్కాలేంటో తెలుసుకుందాం.
1. పెరుగు:
పెరుగు శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది. అందుకే వేసవి కాలంలో దీనిని ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. అంతే కాకుండా ఆహారం తీసుకున్న తరువాత ఒక గ్లాసు పెరుగు తాగితే త్రేన్పుల నుంచి విముక్తి పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
2. ఏలకులు:
ఆహారంలో సువాసనను పెంచేందుకు చిన్న ఏలకులను తరచుగా ఉపయోగిస్తుంటారు. లేదా నేచురల్ మౌత్ ఫ్రెష్‌నర్‌గా కూడా వీటిని ఉపయోగిస్తారు. అయితే ఒకటి లేదా రెండు ఏలకులను నమిలి నీళ్లు తాగితే పుల్లటి త్రేనుపు నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు పేర్కొన్నారు.
3. పుదీనా:
వేసవి కాలంలో పుదీనా వినియోగం చాలా అధికంగా ఉంటుంది. దీనిని వివిధ వంటకాల్లో వాడడం వల్ల పొట్టకు చల్లదనాన్ని, తాజాదనాన్ని ఇస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. జీర్ణక్రియకు సంబంధించిన అన్ని సమస్యలను ఈ ఆకులు దూరం చేస్తుందని వారు చెబుతున్నారు. పుదీనాను ఆహారంలో తీసుకుంటే త్రేనుపు నుంచి ఉపశమనం లభిస్తుందని సూచిస్తున్నారు.
4. అల్లం:
అల్లం ఆహారం రుచిని పెంచడానికి మసాలాగా ఉపయోగించబడుతుంది. అయితే మీరు పచ్చి అల్లంను కొద్దిగా ఉప్పుతో నమిలితే కడుపులోని ఉండే ఆమ్ల వాయువులు తొలగిస్తాయి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి