Diabetic Care Tips: మధుమేహ రోగులు పప్పుధాన్యాలు తినవచ్చా లేదా, ఏ పప్పులు తినాలి

Diabetic Care Tips: మధుమేహ వ్యాధిగ్రస్థులకు డైట్ చాలా ముఖ్యం. ఆహారపు అలవాట్లలో ఏ మాత్రం నిర్లక్ష్యం ఎదురైనా మూల్యం చెల్లించుకోవల్సిందే. మధుమేహ వ్యాధిగ్రస్థులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏది తీసుకోకూడదో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 3, 2022, 07:11 PM IST
Diabetic Care Tips: మధుమేహ రోగులు పప్పుధాన్యాలు తినవచ్చా లేదా, ఏ పప్పులు తినాలి

మధుమేహానికి నియంత్రణ పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకుంటే కచ్చితంగా తగ్గించుకోవచ్చు. అయితే కొన్ని రకాల పప్పులు తినవచ్చో లేదో అనే సందిగ్దత ఏర్పడింది.

పప్పు పదార్ధాల్లో న్యూట్రిషన్ విలువలు అధికం. పప్పులు ఎవరికైనా చాలా మంచిదనే చెబుతారు. అందుకే రోగులకు ముందు పప్పు తినమనే సూచిస్తుంటారు. ఎందుకంటే పప్పుల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. మరి డయాబెటిస్ రోగులు పప్పు తినవచ్చా లేదా అనేది ఓ సందేహం. డయాబెటిస్ రోగులకు పప్పు ధాన్యాలు ఎంతవరకూ మంచిది. 

అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ అట్లాస్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మధుమేహం పీడితుల సంఖ్య 2030 నాటికి దాదాపు 64 కోట్లకు చేరుకుంటుంది. ఈ పరిస్థితుల్లో డయాబెటిస్ ముప్పును తగ్గించేందుకు ఆహారం సరిగ్గా ఉండాలి. వైద్య నిపుణుల ప్రకారం..ఆహారపు అలవాట్లు స్థూలకాయానికి కారణమౌతున్నాయి. ఇండియాలో అత్యధికులు శాకాహారులు కావడంతో పప్పు ధాన్యాలు ఎక్కువగా తింటారు.

పప్పు ధాన్యాల్లో ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణకు దోహదపడతాయి. పప్పుధాన్యాల్లో రెండు రకాల ఫైబర్ ఉంటుంది. కరిగే గుణమున్న ఫైబర్..బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేస్తే..రెండవది మలబద్ధకం నుంచి కాపాడుతుంది. పప్పుధాన్యాల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇందులో ఫైబర్ ఎక్కువ. మధుమేహం రోగులు గ్రైసోమిక్ ఇండెక్స్ 55 కంటే తక్కువ ఉండే పదార్ధాలు మాత్రమే తినాలి. ఎలాంటి పప్పుధాన్యాల్లో గ్లైసోమిక్ ఇండెక్స్ 55 కంటే తక్కువ ఉంటుందో చూద్దాం..

మీకు డయాబెటిస్ ఉంటే పప్పుధాన్యాలు చాలా జాగ్రత్తగా ఎంచుకుని తినాలి. మసూర్ దాల్ తినవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్ నియంత్రణకు దోహదపడుతుంది. అటు బరువు తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇక మినపప్పు కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. శరీరానికి ఎనర్జీ అందిస్తుంది. ఇవి కాకుండా పెసరపప్పు చాలా మంచిది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి..పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్‌లతో నిండి ఉంటుంది.

ఇక రాజ్మా కూడా మధుమేహ వ్యాధిగ్రస్థులు తినవచ్చు. రాజ్మా గ్లైసోమిక్ ఇండెక్స్ 19 ఉంది. ఈ పప్పుధాన్యాలు కంటికి, చర్మానికి చాలా మంచిది. రాజ్మాలో ఫైబర్ ఉండటం వల్ల బ్లడ్ ప్రెషర్ నియంత్రిణలో ఉంటుంది. 

Also read: Weight Loss Diet: శరీర బరువుకి, మధుమేహానికి పసుపు నీటితో 15 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News