Diabetes Early Signs: మధుమేహం వ్యాధికి చాలా లక్షణాలు కన్పిస్తుంటాయి. వీటిలో కొన్ని రాత్రి వేళ స్పష్టంగా బయటపడుతుంటాయి. మీక్కూడా ఈ లక్షణాలు బయటపడితే వెంటనే వైద్యుని సంప్రదించడం మానవద్దు. రక్త పరీక్ష కూడా చేయించుకోవాలి. ఎందుకంటే మధుమేహం ప్రారంభదశ అయితే ఫరవాలేదు. అదే పరిధి దాటితే ఇక జీవితమంతా మందులు వాడుతుండాలి.
మధుమేహం అనేది ఎంత సులభంగా నియంత్రించవచ్చో అంత గంభీరమైంది. ఈ వ్యాధి సోకితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ముప్పు అధికమౌతుంది. ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ సోకుతోంది. ప్రారంభ లక్షణాలు చాలా తేలిగ్గా, పట్టించుకోనట్టుగా ఉంటాయి. ముఖ్యంగా రాత్రి వేళ కొన్ని లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల సీరియస్ సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే శరీరంలో కన్పించే మార్పులు లేదా లక్షణాలను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు.
రాత్రి వేళ ఈ లక్షణాలు కన్పిస్తున్నాయా
కంటి చూపు తగ్గడం. హై బ్లడ్ షుగర్ ఉన్నప్పుడు కంట్లో ఉండే లెన్స్ దెబ్బతింటాయి. దాంతో చూపు మసకగా, అస్పష్టంగా కన్పిస్తుంది. రాత్రి వేళ ప్రత్యేకంగా మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ఇలాంటి లక్షణం కన్పిస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి. రాత్రి వేళ అదే పనిగా దాహం వేస్తుంటే మధుమేహం వ్యాధి కావచ్చు. హై బ్లడ్ షుగర్ ఉంటే డిప్రెషన్‌కు దారి తీస్తుంది.
రాత్రి వేళ కొంతమందికి తరచూ మూత్రం వస్తుంటుంది. నిద్రలోంచి లేవాల్సి వస్తుంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఇలా ఉండదు. బ్లడ్ షుగర్ ఎక్కువైనప్పుడు కిడ్నీలు యూరిన్ ద్వారా బయటకు పంపించేందుకు ప్రయత్నిస్తుంది. అందుకే రాత్రి వేళ ఈ సమస్య ఎక్కువగా కన్పిస్తుంటుంది. కొంతమందికి ఎప్పుడైనా ఎక్కడైనా గాయమైతే త్వరగా మానదు. అలాంటి పరిస్థితి ఉంటే మధుమేహం ఉందని అర్ధం. మధుమేహంలో ఇదొక ప్రధానమైన లక్షణం.
మధుమేహం ఎప్పుడూ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. దీనినే న్యూరోపతి అంటారు. కాళ్లలో నొప్పి, తిమ్మిరిగా ఉండటం, క్రాంప్స్ ఏర్పడటం ఉంటుంది. రాత్రి వేళ ఈ సమస్య అధికంగా ఉండటమే కాకుండా ఎక్కువ ఇబ్బంది కల్గిస్తుంది.
డయాబెటిస్ ముప్పు తగ్గించే చిట్కాలు
ఎప్పుడూ హెల్తీ ఫుడ్ తినాలి. తృణ ధాన్యాలు, ప్రోటీన్లు పుష్కలంగా తీసుకోవాలి. రోజూ తగినంత సమయం వ్యాయామం చేయాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. ధూమపానం మధుమేహాన్ని పెంచుతుంది. మద్యపానం మానేయాలి. ఎప్పటికప్పుడు వైద్యుని సంప్రదించాలి.
Also read: Danger Diseases: తరచూ వాంతులవుతుంటే తేలిగ్గా తీసుకున్నారా అంతే...ఈ 5 ప్రమాదకర వ్యాధుల ముప్పు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook