డయాబెటిస్ ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరిని వేధిస్తోంది. ఫలితంగా వివిధ రకాల ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది. డయాబెటిస్ వ్యాధి ముదిరితే ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. మధుమేహం శరీరంలో ఉంటే కొన్ని లక్షణాల ద్వారా సులభంగా గుర్తించవచ్చు.
డయాబెటిస్ అనేది అత్యంత ప్రమాదకరమైంది. మనిషి శరీరంలో డయాబెటిస్ సోకితే వివిధ రకాల వ్యాధులకు దారితీస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ ముదిరితే ప్రాణాంతకం కూడా కావచ్చు. డయాబెటిస్ ను కొన్ని లక్షణాలతో సులభంగా గుర్తించవచ్చు. ఉదయం లేచిన వెంటనే ఈ లక్షణాలు కన్పిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో ఆ లక్షణాల్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం..
ఉదయం లేచిన వెంటనే కన్పించే డయాబెటిస్ లక్షణాలు
గొంతు ఎండిపోవడం
ఒకవేళ రోజూ ఉదయం లేచిన వెంటనే దాహం వేస్తుంటే, గొంతు ఎండిపోతుంటే ఇది డయాబెటిస్ లక్షణం కావచ్చు. రోజూ ఉదయం లేచిన వెంటనే నీళ్లు తాగాలన్పిస్తుంటే తక్షణం బ్లడ్ షుగర్ లెవెల్స్ పరీక్షించుకోవాలి. ఎందుకంటే గొంతు ఎండిపోవడం డయాబెటిస్ ప్రారంభ లక్షణం.
అలసట
ఉదయం లేచినవెంటనే ఫ్రెష్ ఫీలింగ్ ఉండాలి. అలాకాకుండా ఉదయం లేచిన వెంటనే అలసటగా ఉంటే మాత్రం ఇది మధుమేహం లక్షణం కావచ్చు. అందుకే ఈ లక్షణం కన్పిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
మసకగా కన్పించడం
ఉదయం లేచిన వెంటనే మీకు స్పష్టంగా కన్పించకపోతే లేదా మసకగా ఉంటే ఇది కచ్చితంగా డయాబెటిస్ లక్షణమౌతుంది. దీన్ని సాధారణ లక్షణమనుకుని నిర్లక్ష్యం వహించవద్దు. ఎందుకంటే డయాబెటిస్ ఉంటే దృష్టి మసకబారుతుంది. ఒక కంటికి లేదా రెండు కళ్లకు ఇలా జరగవచ్చు.
దురద
శరీరంలో దురద రావడం డయాబెటిస్ లక్షణమే. ఒకవేళ ఉదయం లేచిన వెంటనే మీకు దురదగా ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే డయాబెటిస్ ఉంటే కాళ్లు, చేతులు లేదా చర్మంపై దురద ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Diabetes Symptoms: ఉదయ లేచిన వెంటనే ఈ లక్షణాలు కన్పిస్తున్నాయా..అయితే జాగ్రత్త