Diabetes Control Tips: తిన్న తర్వాత ఇలా చేస్తే డయాబెటిస్ రాదు..రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించుకోవచ్చు..!

Diabetes Control Tips: డయాబెటిస్ నియంత్రణపై అధ్యయనాలు చేశారు నిపుణులు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలను కనుగొన్నారు. అవెంటో ఇప్పుడు చూద్దాం..

Written by - Alla Swamy | Last Updated : Sep 3, 2022, 04:31 PM IST
  • డయాబెటిస్ నియంత్రణపై అధ్యయనాలు
  • కీలక విషయాలు వెల్లడించిన నిపుణులు
  • స్పోర్ట్ మెడిసిన్ జర్నల్‌లో కథనం
Diabetes Control Tips: తిన్న తర్వాత ఇలా చేస్తే డయాబెటిస్ రాదు..రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించుకోవచ్చు..!

Diabetes Control Tips: 2019 నాటికి దేశంలో 77 మిలియన్ల మందికి మధుమేహం ఉందని అంచనా వేస్తున్నారు. 2045 నాటికి ఈ సంఖ్య 134 మిలియన్లకు చేరే అవకాశం ఉంది. ఇటీవల స్పోర్ట్స్ మెడిసిన్ జర్నల్‌లో దీనిపై ఆర్టికల్ ప్రచురింపబడింది. తిన్న తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని కనుగొంది. శరీరంలో చక్కెర స్థాయిలో తనిఖీ చేసుకునేందుకు, దానిని నియంత్రించేందుకు కొన్ని జీవనశైలి అలవాట్లను సూచించింది. స్పోర్ట్స్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో పలు కీలక విషయాలను వెల్లడించారు. రోజు భోజనం చేసిన తర్వాత రెండు నుంచి 5 నిమిషాల నడకతో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 

తేలికపాటి కార్యకలాపాలతో రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా తగ్గించుకోవచ్చు అంటే..!

కార్బొహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు తీసుకున్న ప్రతిసారి శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. పొస్ట్ర్పాండియల్ స్పైక్ దీనిని సూచిస్తుంది. ఇన్సులిన్ అని పిలువబడే హార్మోన్..శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇది గ్లూకోడ్‌ కణాలను రవాణా చేస్తుంది. దీంతో వారు దీనిని శక్తిగా ఉపయోగించుకోవచ్చు. ఐనాప్పటికీ ఇన్సులిన్, రక్తంలో చక్కెర మధ్య సఖ్యత కుదరకపోవడంతో అస్థిరతకు గురయ్యే అవకాశం ఉంది.  

కాలక్రమేణా శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు క్రమంగా పెరిగితే..అదే సమయంలో ఇన్సులిన్ ప్రతి స్పందించడం ఆపేస్తే..ఇన్సులిన్ నిరోధకతను అభివృద్ధి చేస్తాయని అంటున్నారు. దీని వల్ల టైప్-2 డయాబెటిస్, ప్రీ-డయాబెటిస్‌కు దారి తీయవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈక్రమంలోనే కొత్త అధ్యయనంలో పలు కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. తిన్న ప్రతి సారి కొద్దిగా నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయంటున్నారు.

ఇలా చేయడం వల్ల మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. తిన్న తర్వాత కూర్చోవడం బదులు నిలబడం, నడవడం వల్ల పోస్ట్ర్పాండియల్ గ్లూకోడ్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుందంటున్నారు. చిన్న నడక అయినా ఎంతో ఉపయోగపడుతుందని అధ్యయనంలో పేర్కొన్నారు. తిన్న ప్రతిసారి వేగంగా నడవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుందని..రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

డయాబెటిస్ మేనేజ్‌మెంట్ చిట్కాలు ఇవే..!

డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి చక్కెర స్థాయిలను నియంత్రించడం చాలా అవసరమంటున్నారు. డయాబెటిక్ పరిస్థితి ఉన్నప్పటికీ కంటి చూపు, గుండెపోటు, స్ట్రోక్‌లు, మూత్ర పిండా అస్వస్థతను నివారించేందుకు రక్తంలో చక్కెర లెవల్స్‌ చాలా ముఖ్యమంటున్నారు పరిశోధకులు. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉండాలంటే పండ్లు, కూరగాయలు తినడంతోపాటు ఆరోగ్యకరమైన బరువు ఉండాలంటున్నారు. క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయిలను తనిఖీ చేసుకోవాలంటున్నారు. ఆకలితో లేరని భావించి తప్పు చేయవద్దని..రోజంతా తినడం కొనసాగించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. రసం, సోడా, ఆల్కహాల్‌లో నీటి శాతం ఎక్కువ ఉండేలా చూసుకోవాలంటున్నారు.

Also read:Asia Cup 2022: రేపే భారత్, పాకిస్థాన్ హైవోల్టేజ్‌ మ్యాచ్..తుది జట్లు ఇదిగో..!

Also read:KCR VS NTR: మెగా ఫ్యామిలీకి రెడ్ కార్పెట్.. ఎన్టీఆర్ కు బ్రేక్! కేసీఆర్ సర్కార్ ఎందుకిలా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News