Diabetes Control In 10 Days: మధుమేహం భారత్‌లో తీవ్ర వ్యాధిగా మారుతోంది. ప్రతి కుటుంబంలో ఒక్కరు మధుమేహం బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మార్కెల్ లభించే పలు ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ మధుమేహాన్ని తగ్గించుకోలేకపోతున్నారు. ఈ సమస్య బారిన పడితే ప్రాణాంతక వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ మధుమేహాన్ని ఎంత త్వరగా నియంత్రించుకుంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తీసుకునే ఆహారాలపై శ్రద్ద వహించడం లేదు. దీని వల్ల కూడా మధుమేహం తీవ్ర తరంగా మారుతోంది. కాబట్టి వీరు రోజూ తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
మెంతికూర:
షుగర్ పేషెంట్లకు మెంతికూర చాలా మేలు చేస్తుంది. మెంతులు రక్తంలో చక్కెరను నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మధుమేహంతో బాధపడుతున్నవారికి మెంతి గింజలు కూడా ప్రభావవంతంగా పని చేస్తాయి. మధుమేహాన్ని నియంత్రించుకోవడానికి ముందుగా ఒక చెంచా మెంతి గింజలను ఒక గ్లాసు వేయాలి. వీటిని రాత్రంత నీటిలోనే ఉంచాలి. ఇలా నానబెట్టిన గింజలను ఉదమం ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా తగ్గుతాయి.
వెల్లుల్లి:
వెల్లుల్లిలో అనేక ఆయుర్వేద గుణాలుంటాయి. ఇవి మధుమేహ రోగులకు ప్రభావవంతంగా పని చేస్తాయి. అంతేకాకుండా వెల్లుల్లిలో ఉండే మూలకాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. అయితే మధుమేహాన్ని నియంత్రించుకోవడానికి ప్రతి రోజూ 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలను రాత్రంతా నీటిలో నానబెట్టి వీటిని ఉదయం పూట తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది.
నేరేడు పండ్ల విత్తనాలు:
మధుమేహ నియంత్రణకు నేరేడు పండ్ల పౌడర్ ప్రభావవంతగా పని చేస్తుంది. అందుకే మధుమేహంతో బాధపడుతున్నవారిని నేరేడు పండ్లను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అయితే మధుమేహం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి నేరేడు పండ్ల విత్తనాల పౌడర్‌ను నీటిలో వేసి.. రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే లేచి ఖాళీ కడుపుతో ఆ నానబెట్టిన నీటితో తీసుకుంటే సులభంగా మధుమేహం నుంచి ఉపశమనం లభిస్తుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE TELUGU NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Virat Kohli: విరాట్ కోహ్లి సలహాను పాటించని అశ్విన్.. చాలా తెలివిగా పాకిస్థాన్‌కు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి