Diabetes Facts: ఆందోళన రేపుతున్న మధుమేహం, ఈ 10 లక్షణాలుంటే నిర్లక్ష్యం వద్దు

Diabetes Facts: డయాబెటిస్ అత్యంత ప్రమాదకరమైంది. ప్రపంచంలోనే కాదు..దేశంలో కూడా అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ప్రాణాంతక వ్యాధిగా ఉంది. ఐసీఎంఆర్ తాజా గణాంకాలు ఇప్పుడు ఆందోళన కల్గిస్తున్నాయి. అందుకే ఆ 10 లక్షణాల్ని నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 10, 2023, 01:25 PM IST
Diabetes Facts: ఆందోళన రేపుతున్న మధుమేహం, ఈ 10 లక్షణాలుంటే నిర్లక్ష్యం వద్దు

Diabetes Facts: ఆధునిక జీవనశైలిలో అతి ప్రమాదకరంగా, ఆందోళన కల్గిస్తున్న వ్యాధి మధుమేహం. వ్యాధి సోకడానికి కారణం ఏమైనప్పటికీ నియంత్రణ మాత్రం పూర్తిగా ఆహారపు అలవాట్లు, జీవనశైలిని బట్టే ఉంటుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించిన గణాంకాలు ఇప్పుడు భయపెడుతున్నాయి. ఎందుకంటే..

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తాజా వివరాల ప్రకారం దేశంలో 100 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతుంటే.. 135 మిలియన్ల మంది ప్రీ డయాబెటిస్ లక్షణాలతో ఉన్నారు. నిర్ఘాంతపోయే పరిస్థితి ఉన్నా నిజమిది. ఇంతపెద్ద సంఖ్యలో దేశంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్థులుండటం ఆందోళన కల్గించే అంశం. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం 33,537 మందిని అర్బన్ ప్రాంతం నుంచి, 79,506 మందిని రూరల్ ప్రాంతం నుంచి 20 ఏళ్ల పైబడినవారిపై 2008-2020 మధ్యలో పరిశీలించారు. ఈ సర్వే దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సాగింది. 

డయాబెటిస్‌లో రెండు రకాలుంటాయి. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ అనేది ఇన్సులిన్ ఆధారితం కాగా టైప్ 2 డయాబెటిస్ అనేది నాన్ ఇన్సులిన్ డయాబెటిస్. సకాలంలో అంటే త్వరగా గుర్తించగలిగి చికిత్స ప్రారంభిస్తే డయాబెటిస్ నియంత్రణ సాధ్యమే. ఫలితంగా దీర్ఘకాలం కొనసాగకుండా నియంత్రించవచ్చు. ఇంత ప్రమాదకరమైన డయాబెటిస్ వ్యాధిని 10 లక్షణాలతో గుర్తించవచ్చంటున్నారు. 

1.  చర్మంపై నల్లటి మచ్చలు
2. తిమ్మిరి లేదా ఇరిటేషన్ సమస్య
3. తరచూ ఇన్‌ఫెక్షన్ రావడం
4. తీవ్రమైన అలసట
5. తరచూ మూత్రానికి వెళ్లడం
6. ఊహించని విధంగా బరువు తగ్గడం
7. అతి దాహం
8. ఆకలి పెరగడం
9. మసకగా కన్పించడం
10. గాయం త్వరగా మానకపోవడం

మధుమేహాన్ని త్వరగా గుర్తించగలగడం చాలా కీలకం. ఎప్పటికప్పుడు డయాబెటిస్ పరీక్ష చేయించుకోవడంపైనే వ్యాధి చికిత్స లేదా నియంత్రణ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే డయాబెటిస్ అదుపు తప్పితే కచ్చితంగా కిడ్నీల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఊహించని విధంగా బరువు తగ్గిపోవడం, తరచూ మూత్రం రావడం, వివిధ అంగాలపై ప్రభావం పడటం, కంటి శుక్లాల్లో మార్పులు, తీవ్రమైన అలసట ఇలా వివిధ లక్షణాలతో మధుమేహాన్ని గుర్తించవచ్చు.

Also read: Breakfast Diet: రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఏది తినాలి, ఏది తినకూడదో తెలుసా

ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా డయాబెటిస్ నియంత్రణ సాధ్యమే. లిపిడ్ ప్రొఫైల్స్, కిడ్నీ ఫంక్షన్, యూరిన్ మైక్రో అల్బూమిన్, క్రియేటినిన్ పరీక్షల ద్వారా డయాబెటిస్ పరిస్థితి ఎలా ఉందనేది అంచనా వేయవచ్చు. అదే సమయంలో ఆహారపు ఆలవాట్లపై శ్రద్ధ పెట్టడం, రోజూ తగిన వ్యాయామం చేయడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు.

Also read: Cholesterol Tips: మీ డైట్‌లో ఈ ఆహార పదార్ధాలుంటే కొలెస్ట్రాల్ 30 రోజుల్లో మాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News