Hair loss, Dandruff: జుట్టు రాలడం, చుండ్రు సమస్యల నివారణకు simple health tips

Heath tips to stop hair loss, dandruff: మీ జుట్టు కుదుళ్లు బలహీనపడినప్పుడు జుట్టు రాలడం (Hair fall) అత్యంత సహజం. మీ తలపైన ఉండే చర్మం పొడిబారినప్పుడు (Dry scalp) అది చుండ్రుగా మారుతుంది. మీ కుదుళ్ళు బలహీన పడినప్పుడే కాకుండా చుండ్రుతో (Dandruff) బాధపడే వారిలోనూ జుట్టు రాలే సమస్య చాలా సాధారణంగా కనిపిస్తుంది. చాలా మందికి నా జుట్టు ఎందుకు రాలిపోతుంది? ఇది పోషకాహారం లోపమా లేక కుదుళ్ళ బలహీనత వల్లనా ? అనే సందేహాలు బుర్రను తొలిచేస్తుంటాయి.

Last Updated : Feb 17, 2021, 05:54 PM IST
  • మీ జుట్టు కుదుళ్లు బలహీనపడి జుట్టు ఊడుతోందా ?
  • చుండ్రు సమస్య కూడా అధికంగా కనిపిస్తోందా ?
  • జుట్టు రాలడానికి, చుండ్రు రావడానికి కారణాలు ఏంటి ? ఈ రెండు సమస్యలకు పరిష్కారం ఏంటి ?
Hair loss, Dandruff: జుట్టు రాలడం, చుండ్రు సమస్యల నివారణకు simple health tips

Heath tips to stop hair loss, dandruff: మీ జుట్టు కుదుళ్లు బలహీనపడినప్పుడు జుట్టు రాలడం (Hair fall) అత్యంత సహజం. మీ తలపైన ఉండే చర్మం పొడిబారినప్పుడు (Dry scalp) అది చుండ్రుగా మారుతుంది. మీ కుదుళ్ళు బలహీన పడినప్పుడే కాకుండా చుండ్రుతో (Dandruff) బాధపడే వారిలోనూ జుట్టు రాలే సమస్య చాలా సాధారణంగా కనిపిస్తుంది. చాలా మందికి నా జుట్టు ఎందుకు రాలిపోతుంది? ఇది పోషకాహారం లోపమా లేక కుదుళ్ళ బలహీనత వల్లనా ? అనే సందేహాలు బుర్రను తొలిచేస్తుంటాయి. ఈ రెండూ కాకుండా చుండ్రు వల్లే రాలిపోతుందా ? అని మధనపడిపోయే వాళ్లు కూడా ఉంటారు. చుండ్రు ఉండి జుట్టు రాలుతున్నట్టయితే.. చుండ్రు వల్లే అలా జుట్టు రాలే అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారు పలువురు డెర్మటాలజిస్టులు. అలాగని Dandruff problems ఉన్న ప్రతీ ఒక్కరిలో జుట్టు రాలే సమస్యలు కూడా కనిపించవు. ఎందుకంటే జుట్టు రాలడానికి కేవలం చుండ్రు మాత్రమే సమస్య కాదు.అందుకు అనేక కారణాలు ఉంటాయి.  

చాలా మంది తలస్నానం (Head bath) చేసేటప్పుడు జుట్టు రాలడం గమనిస్తూ ఉంటారు. తరచుగా జుట్టును Shampoo wash చేయడం వల్లనే జుట్టు రాలడం, పొడిబారిపోవడం వంటివి జరుగుతున్నాయని చాల రోజుల పాటు తల స్నానం చేయడం ఆపేస్తుంటారు. అలా చేయడం వల్ల జుట్టు ఇంకా ఎక్కువ స్థాయిలో ఊడిపోయే అవకాశాలు ఉన్నాయని Hair care experts చెబుతున్నారు. అలాగే చుండ్రు వల్ల తలపై దురద మొదలవుతుంది (Itching due to dandruff). దానివల్ల కొంతమంది ఎప్పుడు చూసినా తలను గోకుతూనే ఉంటారు. అలా గీకడం వల్ల జుట్టు లాగినట్టు అయ్యి ఇంకా ఎక్కువగా ఊడుతుందని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.

కొన్నిసార్లు, కొన్ని రకాల ట్యాబ్లేట్స్ వాడడం వల్ల కలిగే వాటి సైడ్ ఎఫెక్ట్స్ (Side effects of tablets) వల్ల కూడా జుట్టు రాలుతుంది. జుట్టు రాలకుండా ఉండేందుకే వాడే ఔషధాలలో రకరకాల రసాయనాలు కలిగి ఉంటాయి. ఇవి మాడును పొడిగా మారుస్తాయి. ఫలితంగా చుండ్రు ఏర్పడి దురద వస్తుంది. ఈ సమస్యను అరికట్టాలంటే.. మీరు మీ జుట్టును చుండ్రును నిరోధించే షాంపూతో (Best anti dandruff shampoos) క్రమం తప్పకుండా కడగడం మంచిది.

Also read : Headache with COVID-19: కరోనాతో వచ్చే తలనొప్పికి, సాధారణ తలనొప్పికి Symptoms ఎలా ఉంటాయి ?

How to check dandruff and hair fall issues: చుండ్రు సమస్యను, జుట్టు రాలడాన్ని సహజంగా ఎలా ఎదుర్కోవాలి ?
మొదట, జుట్టు రాలకుండా తీసుకునే జాగ్రత్తలలో ఆరోగ్యకరమైన ఆహారం అనేది చాలా ముఖ్యమైనది. మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలను ఉండేలా చూసుకోవాలి, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. అంతేకాకుండా, జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. చుండ్రును ఎదుర్కోవటానికి, వారానికి ఒకసారి మీ జుట్టును ఆపిల్ సైడర్ వెనిగర్‌తో (Apple cider vinegar for hair) కడగడానికి ప్రయత్నించండి. ఆపిల్ సైడర్ వెనిగర్ యాంటీ బాక్టీరియల్ గుణాలు చుండ్రును ఎదుర్కోవటానికి సహాయపడతాయి. 

Hair loss సమస్యను నివారించడానికి ఒక్కోసారి చిన్నచిన్న చిట్కాలు కూడా ఉపయోగపడతాయి. అందులో ఒకటి కోడి గుడ్డులోని పసుపు పచ్చనీలం (Egg yellow for hair care). ఇందులో ఆరోగ్యకరమైన జుట్టుకు అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. 

Also read : COVID-19 updates: Pregnant ladies కి షాకింగ్ న్యూస్ !

గమనిక: ఇందులో ఉన్న సమాచారం డెర్మటాలజిస్టుల సలహా మాత్రమే. ఐతే, అన్ని సందర్భాలలో ఆరోగ్య సమస్యలు ఒకలా ఉండవు. శరీరంలో మార్పుల ఆధారంగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వాటి పరిష్కారం, చికిత్స కోసం వైద్యుడిని సంప్రదించిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News