Coronavirus New Wave Alert: కరోనా ఇంకా అంతం కాలేదు. మరో ప్రమాదకర వేవ్ పొంచి ఉంది జాగ్రత్త

Coronavirus New Wave Alert: కరోనా ఇంకా అంతం కాలేదా..కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌లో మరో సబ్ వేరియంట్ ఇప్పుడు వెలుగు చూస్తోంది. ఇండియాలో కూడా ప్రవేశించిన ఈ వేరియంట్ లక్షణాలేంటో తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 6, 2022, 10:45 PM IST
Coronavirus New Wave Alert: కరోనా ఇంకా అంతం కాలేదు. మరో ప్రమాదకర వేవ్ పొంచి ఉంది జాగ్రత్త

కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచాన్ని రెండేళ్లుగా నాశనం చేసేసింది. కరోనా వైరస్ ఇప్పటి వరకూ మూడు వేవ్స్‌లో ప్రపంచాన్ని చుట్టుముట్టింది. ఇప్పుడు మరోసారి భయపెడుతోందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.

కరోనా థర్డ్‌వేవ్‌లో బయటపడిన ప్రధానమైన వేరియంట్ ఒమిక్రాన్. ఒమిక్రాన్ కొత్త కొత్త వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెంచుతోంది. ఇప్పుడు ఒమిక్రాన్ మరో కొత్త సబ్ వేరియంట్ XBB,XBB1 వెలుగుచూసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఛీఫ్ సైంటిస్ట్ సౌమ్యా విశ్వనాధన్ ఈ విషయమై హెచ్చరికలు జారీ చేశారు. ఆ హెచ్చరిక వింటే భయపడతారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB మరో కొత్త వేవ్‌కు కారణమౌతుందనేదే ఆ హెచ్చరిక.

XBB అంటే ఏమిటి

ఒమిక్రాన్ సబ్ లైనేజ్ BJ.1,BA.2.75తో కలిసి XBBగా మారింది. XBBకు చెందిన సబ్ లైనేజ్ XBB.1.ఇప్పటికే అమెరికా, సింగపూర్, బ్రిటన్‌లలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. అటు చైనాలోని చాలా నగరాల్లో మరోసారి లాక్‌డౌన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇండియాలో కూడా ఈ వేరియంట్ ప్రవేశించింది. మహారాష్ట్రలో అన్నింటికంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అక్టోబర్ 29న దేశంలో XBB,XBB.1కేసులు 36 వరకూ ఉన్నాయి.

కొత్త వేరియంట్ ఎంతవరకూ ప్రమాదకరం

ఈ కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తుంది. కానీ ఈ కారణంతో రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లే పరిస్థితి గానీ, మరణాలు గానీ సంభవించే పరిస్థితి తక్కువే. కొత్త వేరియంట్ బతికుండేందుకు తనకు తాను ఇమ్యూనిటీ నుంచి రక్షించుకుంటుంది.

అత్యధికులు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వైరస్‌కు వ్యతిరేకంగా ఇమ్యూనిటీ అభివృద్ధి చెంది ఉంటుంది. అందుకే ఈ వైరస్ తనను తాను బతికుండేందుకు ఇమ్యూనిటీ నుంచి కవచం ఏర్పర్చుకుంటుంది. 

ఒమిక్రాన్ కొత్త వేరియంట్ లక్షణాలు

గొంతులో గరగర, దగ్గు, జలుబు ప్రధాన లక్షణాలు. కానీ 3-4 రోజుల్లో తగ్గిపోతున్నాయి. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ జస్టిస్ సౌమ్యా విశ్వనాథన్ ప్రకారం ఈ కొత్త వేరియంట్ XBB ఇమ్యూనిటీని పెంచడంలో సామర్ధ్యం కలిగి ఉంది. ఈ కారణంగా కొన్నిదేశాల్లో కొత్త వేవ్‌కు దారి తీయవచ్చు. ఈ వైరస్‌పై నిఘా పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమని తెలుస్తోంది.

Also read: Dengue Virus: చలికాలం డెంగ్యూతో జాగ్రత్త, ఈ లక్షణాల్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News