Control High Cholesterol Level: అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమ.!

Control High Cholesterol Level: భారత్‌లో ప్రస్తుతం చాలా మంది అనారోగ్యకరమైన ఆహారం తింటున్నారు. దీని కారణంగా చెడు కొలెస్ట్రాల్‌  శరీరంలో పేరుకుపోతోంది. అంతేకాకుండా మధుమేహం, అధిక రక్తపోటు, గుండెపోటుకు దారితీస్తుంది. కొందరిలో ఇది ప్రాణాంతకంగా మారుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 7, 2022, 02:36 PM IST
  • అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారా..
  • వెల్లుల్లిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు
  • పెరుగుతున్న కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది
Control High Cholesterol Level: అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమ.!

Control High Cholesterol Level: భారత్‌లో ప్రస్తుతం చాలా మంది అనారోగ్యకరమైన ఆహారం తింటున్నారు. దీని కారణంగా చెడు కొలెస్ట్రాల్‌  శరీరంలో పేరుకుపోతోంది. అంతేకాకుండా మధుమేహం, అధిక రక్తపోటు, గుండెపోటుకు దారితీస్తుంది. కొందరిలో ఇది ప్రాణాంతకంగా మారుతోంది. అయితే తినే ఆహారంపై శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు నియంత్రణలో ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా విముక్తి పొందడానికి గ్రేటర్ నోయిడాలోని GIMS హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ డైటీషియన్ డాక్టర్ ఆయుషి యాదవ్ ఆహారంలో వెల్లుల్లిని అధికంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి మంచి లభాలను చేకూర్చుతాని ఆయన ZEE NEWSకి వివరించారు.

పెరుగుతున్న కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది:

వెల్లుల్లిలో విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, అలిసిన్, అజోయిన్, ఎస్-ఇథైల్‌సిస్టీన్, డయల్సల్ఫైడ్ వంటి ఆర్గానోసల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు హెర్బల్ లక్షణాలతో నిండి ఉన్నాయి. ఇది క్రమం తప్పకుండా తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. రోజూ పచ్చి వెల్లుల్లి తింటే రక్తపోటు కూడా అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వెల్లుల్లిని ఎలా తీసుకోవాలి:    

1. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం మొదలైతే.. చాలా రకాల శరీర సమస్యలకు దారీ తీయోచ్చు. దీని కోసం వెల్లుల్లి, నిమ్మరసం కలిపి త్రాగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయడం వల్ల లిపిడ్ స్థాయిలు మెరుగుపడి రక్తపోటును నియంత్రింస్తుందని నిపుణులు చెబుతున్నారు.

2.  ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత పచ్చి వెల్లుల్లి మొగ్గలను తినవచ్చు. ఇలా చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది.

3. వెల్లుల్లి వాసన చాలా కఠినంగా ఉంటుంది. దీనికి కారణం వెల్లుల్లిలో అల్లిసిన్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

4. వెల్లుల్లి ప్రభావం శరీరానికి వేడిని కలిగిస్తుంది. కాబట్టి మీరు వేసవి సీజన్‌లో దీన్ని అవసరానికి మించి తీసుకుంటే.. ఆరోగ్యం సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Weight Loss Mistakes: బరువు తగ్గే క్రమంలో ఇలా చేయకండి.. ఈ విధంగా చేస్తే సమస్యలు తప్పవు..!

Also Read: Lalu Prasad Yadav's Health Condition: లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమం.. లేటెస్ట్ అప్‌డేట్స్

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News