Cholesterol Tips: రాత్రి వేళ పొరపాటున కూడా తినకూడని పదార్ధాలు ఇవే

Cholesterol Tips: కొలెస్ట్రాల్ అత్యంత ప్రమాదకరమైంది. కొలెస్ట్రాల్ నియంత్రించాలంటే డైట్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టాల్సిందే. రాత్రి వేళ కొన్ని వస్తువుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. లేకపోతే సమస్య మరింత జటిలమౌతుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 26, 2022, 11:22 PM IST
Cholesterol Tips: రాత్రి వేళ పొరపాటున కూడా తినకూడని పదార్ధాలు ఇవే

హై కొలెస్ట్రాల్ అనేది చాలా రకాల సమస్యలకు కారణమౌతుంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా కొలెస్ట్రాల్ సమస్య పెరుగుతుంటుంది. హానికారక ఆహార పదార్ధాలు కూడా ఇందుకు దోహదం చేస్తాయి. 

కొలెస్ట్రాల్ నియంత్రించాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహార పదార్ధాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రాత్రి వేళ కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. రాత్రి వేళ ఎలాంటి ఆహారం తీసుకోకూడదో చూద్దాం. రాత్రి వేళ ఆహార పదార్ధాలు తీసుకున్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీ లేక కొవ్వు పెరిగిపోతుంది. 

ఫాస్ట్ ఫుడ్స్

ఫాస్ట్ ఫుడ్స్ గుండెకు చాలా హాని కల్గిస్తాయి. కొలెస్ట్రాల్‌ను గట్టిగా పెంచుతాయి. ప్రత్యేకించి రాత్రి వేళ ఫాస్ట్‌ఫుడ్స్ తినకూడదు. పిజ్జా, పాస్తా, బర్గర్, నూడిల్స్ వంటి ఫాస్ట్‌ఫుడ్స్ మైదాతో తయారవుతుంటాయి. ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు. చాలా నష్టం కల్గిస్తాయి.

చీజ్

చీజ్ తినడం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా తింటున్నారు. పిజ్జా, బర్గర్, పాస్తా వంటి ఫాస్ట్ ఫుడ్స్ చీజ్ లేకుండా ఎవరూ తినరు కూడా. చీజ్‌లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి కానీ చీజ్ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఇందులో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. అంటే గుండెకు చాలా హాని కల్గిస్తుంది. 

రెడ్ మీట్

నాన్ వెజిటేరియన్ తినేవాళ్లు రెడ్ మీట్ మంచిది కాదు. ఇందులో న్యూట్రియంట్లు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. రెడ్ మీట్‌లో శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్, గుండె ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.  రాత్రి వేళ రెడ్ మీట్ తినకుండా ఉంటే మంచిది.

ఆయిల్, మసాలా ఫుడ్స్

రాత్రి వేళ మసాలా, ఆయిల్ ఎక్కువగా ఉండే పదార్ధాలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఆయిల్‌లో శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను వేగంగా పెంచుతుంది. శాచ్యురేటెడ్ కొవ్వు రక్త నాళికల్లో పేరుకునిపోతుంది. ఫలితంగా రక్త సరఫరా నిలిచిపోతుంది.

స్వీట్స్

రాత్రి వేళ స్వీట్స్ తినడం ఏ మాత్రం మంచిది కాదు. స్వీట్స్ తినడం వల్ల డయాబెటిస్, కొలెస్ట్రాల్ రెండూ  పెరుగుతాయి. అందుకే రాత్రి వేళ టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. రాత్రి వేళ హల్వా, స్వీట్స్, చల్లని పానీయాలు గుండెకు హాని కల్గిస్తాయి.

Also read: Eye Care Tips: మధుమేహం కంటి చూపును హరించేస్తుంది, ఈ లక్షణాలు చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News