Cholesterol Control Food: శరీరం దృఢంగా, ఆరోగ్య వంతంగా ఉండాలంటే శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండాలి. లేదంటే శరీరానికి హాని కలింగించే గుండెపోటు, బిపి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అధికమవడం వల్ల ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కొవ్వు నియంత్రణలో ఉండానికి మార్కెట్‌లో చాలా రకాల ఉత్పత్తులు ఉన్నాయి. కానీ అవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. అయితే చాలా మంది ఆయుర్వేద నిపుణులు ఇంటి నివారణలతో నియంత్రించుకోవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా మనం నిత్యం వంటకాల్లో వాడే టమోటాలతో కూడా శరీరంలోని కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవచ్చని వారు తెలుపుతున్నారు. కావున చెడు కొలెస్ట్రాల్ నియంత్రించుకోవడానికి టమోటా ఏ విధంగా సహాయపడుతుందో తెలుసుకుందాం..
టమోటా రసం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణ:
టమోటా జ్యూస్‌తో శరీరంలో కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుందని చాలా మందికి తెలియని విషయం. కానీ కొవ్వు నియంత్రణ కోసం ప్రతిరోజూ రసాన్ని తాగాలని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీనిని తాగడానికి ముందు వైద్యున్ని సంప్రదించాలని వారు భావిస్తున్నారు.
గ్రీన్ టీతో కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది:
బరువును తగ్గించడానికి, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి గ్రీన్-టీ ఎంతగానో సహాయపడుతుంది. గ్రీన్-టీని క్రమం తప్పకుండా తాగితే మంచి ఫలితాలను పొందుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పాలు శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి:
ఓట్ మిల్క్ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఈ పాలలో బీటా-గ్లూకాన్ అనే పదార్థం ఉంటుంది. కావున వీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరానికి మంచి లాభాలను చేకూర్చుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి సహాయపడుతుంది.
(NOTE: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ దావా లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook