Cabbage Health Benefits: క్యాబేజీ తినేవారికి ఈ అనారోగ్య  సమస్యలే దరిచేరవట..

Cabbage Health Benefits: క్యాబేజీ మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. క్యాబేజీ క్రూసిఫెరోస్ జాతికి చెందిన కూరగాయ. ఇందులో విటమిన్ సి, ఏ పుష్కలంగా ఉంటుంది.

Last Updated : May 3, 2024, 03:44 PM IST
Cabbage Health Benefits: క్యాబేజీ తినేవారికి ఈ అనారోగ్య  సమస్యలే దరిచేరవట..

Cabbage Health Benefits: క్యాబేజీ మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. క్యాబేజీ క్రూసిఫెరోస్ జాతికి చెందిన కూరగాయ. ఇందులో విటమిన్ సి, ఏ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు క్యాబేజీలో మినరల్స్ కూడా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన ఎముకలకు సహాయపడుతుంది. అంతేకాదు ఇమ్యూనిటీ వ్యవస్థకు ఎంతో సహాయపడుతుంది. క్యాబేజీలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మెరుగు చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఇన్ల్పమేషన్ సమస్యను తగ్గిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఇస్తుంది.

క్యాబేజీని తరచుగా తినేవారికి క్యాన్సర్ నుంచి విముక్తి కలుగుతుంది. క్యాబేజీ డిన్నర్ లో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ క్యాలరీ లెవల్ తక్కువగా ఉంటాయి. కాబట్టి నైట్‌ లైట్‌ డిన్నర్‌ తీసుకున్నట్లు ఉంటుంది.

గుండె ఆరోగ్యం..
క్యాబేజీలో ఆంథోసినిన్ కంటెంట్ ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెజర్ ని తగ్గిస్తుంది గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఈ కాలంలో చాలా మందికి  చిన్న వయసులోనే గుండె సమస్యలు వస్తాయి. దీనివల్ల ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. క్యాబేజీ డైట్లో చేర్చుకోవడం వల్ల  గుండె సమస్యలు రాకుండా  కాపాడుతుంది.

జీర్ణ ఆరోగ్యం..
క్యాబేజీలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగు చేస్తుంది మలబద్ధకంతో దీర్ఘకాలికంగా సమస్య బారిన పడినవారు క్యాబేజీని డైట్ లో చేరుకో చేర్చుకోవాలి ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మెరుగైన కంటి చూపు..
క్యాబేజీలో శాంతిన్ లూటీన్ పుష్కలంగా ఉంటుంది ఇది కంటి చూపులు మెరుగుపరుస్తుంది. ఇది కంటిని  ఒక షీల్డ్ లాగా కాపాడుతుంది. హానికర సూర్యకిరణాల నుంచి కంటిని కాపాడుతుంది. క్యాబేజీలో విటమిన్ ఈ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

ఇదీ చదవండి: బెల్‌ పెప్పర్స్‌ తింటున్నారా? లేకపోతే ఈ 6 ప్రయోజనాలు మిస్సయినట్లే..

క్యాన్సర్..
క్యాబేజీలో సల్ఫోరోఫెన్ అని అంటే ఆక్సిడెంట్ ఉంటుంది ఇది ఇందులో యాంటీ క్యాన్సర్ గుణాలు పుష్కలంగా ఉంటాయి అంతేకాదు క్యాబేజీలో డ్రెస్సి నైన్ ఐసోతియోసనెట్స్ ఉంటాయి క్యాబేజీలో ఉండే కెమికల్ మన శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా కాపాడుతుంది కడుపు కాలేయం లివర్ బ్లాడర్ బ్రెస్ట్ క్యాన్సర్లను కూడా నివారిస్తుంది.

ఇమ్యూనిటీ..
క్యాబేజీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది దీంతో ఇమ్యూనిటీ వ్యవస్థ బలంగా మారుతుంది సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతుంది క్యాబేజీని తప్పకుండా మన డైట్ లో చేర్చుకోవాలి ఇది పిల్లల ఆరోగ్యానికి కూడా ఎంతో ముఖ్యం. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

ఇదీ చదవండి: బాదం.. పోషకాలకు పవర్‌హౌజ్.. ప్రతిరోజూ 4 తింటే ఈ షాకింగ్‌ రిజల్ట్స్‌ మీ సొంతం..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News